Bihar | కదులుతున్న రైలు నుంచి.. అవతలి ట్రైన్‌లోని వారిపై బెల్ట్‌తో దాడి! వీడియో వైరల్
Bihar | విధాత: కదులుతున్న రైలు (Train) తలుపు వద్ద నిలుచున్న ఓ యువకుడు.. పక్క ట్రాక్‌పై వెళుతున్న ట్రైన్‌లో కూర్చున్న వారిని బెల్ట్‌తో కొడుతున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను బిహార్ (Bihar) లోని చప్రా జిల్లాలో షూట్ చేసిందని దీనిని పోస్ట్ చేసిన యూజర్ పేర్కొన్నారు. 'పక్క రైలులో తలుపుల దగ్గర కూర్చున్న వారిని ఇతడు లెదర్ బెల్ట్‌తో కొడుతున్నాడు. ఇది నిజం. దీని వల్ల అవతలివారికి గాయాలవ్వచ్చు. వారు కింద […]

Bihar |
విధాత: కదులుతున్న రైలు (Train) తలుపు వద్ద నిలుచున్న ఓ యువకుడు.. పక్క ట్రాక్‌పై వెళుతున్న ట్రైన్‌లో కూర్చున్న వారిని బెల్ట్‌తో కొడుతున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను బిహార్ (Bihar) లోని చప్రా జిల్లాలో షూట్ చేసిందని దీనిని పోస్ట్ చేసిన యూజర్ పేర్కొన్నారు.
‘పక్క రైలులో తలుపుల దగ్గర కూర్చున్న వారిని ఇతడు లెదర్ బెల్ట్‌తో కొడుతున్నాడు. ఇది నిజం. దీని వల్ల అవతలివారికి గాయాలవ్వచ్చు. వారు కింద పడిపోయి మరణించే ప్రమాదమూ ఉంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అతడు రైల్వేను ట్యాగ్ చేశాడు.
అయితే ఈ వీడియో ఏ సమయంలో ఏ మార్గంలో తీశారనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై రైల్వే శాఖ స్పందించింది, ఇలాంటి చర్యకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని, అతడిపై చట్టపరంగా కఠిన చర్యలకు ఆదేశిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
यह व्यक्ति दुसरे ट्रेन में दरवाजे के पास बैठे लोगों को बेल्ट से मार रहा है, क्या यह सही है