Telangana | తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
Telangana | రాష్ట్రంలో నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టిన విషయం విదితమే. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. అయితే రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి […]

Telangana | రాష్ట్రంలో నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టిన విషయం విదితమే. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. అయితే రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర, దక్షిణ ద్రోణి ఈ రోజు పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.90 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.