Governer Tamilisai Soundar Rajan| ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ చాలా దగ్గర.. తెలంగాణ CSపై గవర్నర్‌ ఫైర్‌

TELANGANA GOVERNER Tamilisai Soundar Rajan| విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సీరియస్‌ అయ్యారు. పెండింగ్‌లో పెట్టిన బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌పై గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundar Rajan) పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ చాలా దగ్గర అని వ్యాఖ్యానించారు. Again i remind you Rajbhavan is nearer than Delhi @TelanganaCS — […]

  • By: Somu |    latest |    Published on : Mar 03, 2023 6:40 AM IST
Governer Tamilisai Soundar Rajan| ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ చాలా దగ్గర.. తెలంగాణ CSపై గవర్నర్‌ ఫైర్‌

TELANGANA GOVERNER Tamilisai Soundar Rajan|

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సీరియస్‌ అయ్యారు. పెండింగ్‌లో పెట్టిన బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌పై గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundar Rajan) పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ చాలా దగ్గర అని వ్యాఖ్యానించారు.

శాంతికుమారి సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కనీస మర్యాదగా కూడ వచ్చిన తనను కలువ లేదన్నారు. ఇలాంటి విషయాలు చర్చల ద్వారా మాత్రమే పరిష్కరం అవుతాయని అన్నారు.

రాజ్‌ భవన్‌కు రావడానికి సమయం కూడ దొరకడం లేదా అని అన్నారు. ప్రోటోకాల్‌ లేదు.. పిలిచినా కూడా మర్యాద లేదన్నారు. మరోసారి చెపుతున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గర అని చెప్పారు.