Rana Daggubati | రానాకు ఏం కాలేదు.. మళ్లీ సినిమాలు చేస్తాడటా!

Rana Daggubati విధాత‌: రానా దగ్గుబాటి అనేకంటే భళ్ళాల దేవ అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. అలాంటి బలమైన ముద్రను వేసింది బాహుబలిలోని భళ్ళాల దేవ పాత్ర. అతని ఎత్తుకు, బలమైన శరీర సౌష్టవానికి భళ్ళాలదేవ పాత్ర సరిగ్గా సరిపోయింది. రానా నటనకు సంబంధించి అతను ఎంచుకునే పాత్రలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో బాబాయ్ వెంకటేష్‌తో కలిసి నటించిన రానానాయుడు వెబ్ సిరీస్ కూడా మంచి టాకే తెచ్చుకుంది.. కాకపోతే […]

Rana Daggubati | రానాకు ఏం కాలేదు.. మళ్లీ సినిమాలు చేస్తాడటా!

Rana Daggubati

విధాత‌: రానా దగ్గుబాటి అనేకంటే భళ్ళాల దేవ అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. అలాంటి బలమైన ముద్రను వేసింది బాహుబలిలోని భళ్ళాల దేవ పాత్ర. అతని ఎత్తుకు, బలమైన శరీర సౌష్టవానికి భళ్ళాలదేవ పాత్ర సరిగ్గా సరిపోయింది. రానా నటనకు సంబంధించి అతను ఎంచుకునే పాత్రలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి.

అయితే ఈ మధ్య కాలంలో బాబాయ్ వెంకటేష్‌తో కలిసి నటించిన రానానాయుడు వెబ్ సిరీస్ కూడా మంచి టాకే తెచ్చుకుంది.. కాకపోతే కంటెంట్ పరంగా కాస్త బోల్డ్‌గా ఉందనే టాక్‌ని సొంతం చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ తిట్టుకునేలా చేసింది.

ఇక ప్రస్తుతానికి వస్తే.. రానా నుంచి చాలా రోజులుగా సరైన ప్రాజెక్ట్ రానే లేదు. రానా అంటే బాహుబలి సినిమా తప్ప.. మరో సినిమా చెప్పుకోవడానికి లేనంతగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఆయనేదో వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నాడనేలా కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. తాజాగా అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ (SDCC) 2023 వేడుకలో తన తదుపరి చిత్రాలకు సంబంధించిన విషయాలను రివీల్ చేశారు. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ చిత్ర టైటిల్, గ్లింప్స్ వదిలేందుకు.. ఆ చిత్ర బృందంతో పాటు అమెరికా వెళ్లిన రానా.. తను పనిచేయబోతున్న ప్రాజెక్ట్స్ గురించిన వివరాలపై క్లారిటీ ఇచ్చాడు.

గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘హిరణ్య కశ్యప’ చిత్రంలో రానా హీరోగా చేయబోతున్నాడు. దీనికి త్రివిక్రమ్ కథను అందించనున్నాడు. ఆ సినిమా అమర చిత్ర కథలు ఆధారంగా రూపొందుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో గుణశేఖర్ పేరు ఎక్కడా లేకపోవడం.. ఇప్పుడో కాంట్రవర్సీగా మారింది.

ఇక మరో చిత్రం మలయాళ మూవీ ‘మిన్నల్ మురళి’ని కామిక్ రూపంలో ‘టింకిల్’ పేరుతో నిర్మించనున్నాడట. ఈ ప్రాజెక్ట్‌ని రానాకు సంబంధించిన స్పిరిట్ మీడియా సంస్థ, వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తుంది.

అలాగే సోనీలివ్ కోసం ‘లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్’ పేరుతో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ ఓ హిస్టారికల్ వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించనుందని తెలుస్తోంది. ‘హిరణ్య కశ్యప’ కాకుండా ఆయన ప్రకటించిన ‘టింకిల్’లో ఎవరు హీరోగా చేస్తారనేది రానా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సోనీ లివ్ కోసం చేసే వెబ్ సిరీస్‌లో తన పాత్ర ఏంటో కూడా రానా సెలవివ్వలేదు. మొత్తంగా అయితే రానా మళ్లీ నటించ బోతున్నాడనేది మాత్రం ఈ అనౌన్స్‌మెంట్స్‌తో క్లారిటీ ఇచ్చాడు.