Project K | వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్.. హాలీవుడ్ రేంజ్‌లో టీజ‌ర్

Project K: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఖండాంతరాలు దాట‌డంతో మేక‌ర్స్ ఆయన‌తో హాలీవుడ్ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు. గ‌త సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ప్ర‌స్తుతం సెట్స్ పైన ఉన్న సినిమాల‌పై ప్ర‌త్య‌క దృష్టి పెడుతున్నారు. స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ప్ర‌భాస్ ఖ్యాతిని మ‌రింత పెంచుతాయ‌నే విశ్వాసంతో ఉన్నారు. గ‌త కొద్ది రోజులుగా మూవీ టీజ‌ర్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం టీజ‌ర్ విడుదల‌ చేశారు. […]

  • By: sn    latest    Jul 21, 2023 1:46 AM IST
Project K | వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్.. హాలీవుడ్ రేంజ్‌లో టీజ‌ర్

Project K: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఖండాంతరాలు దాట‌డంతో మేక‌ర్స్ ఆయన‌తో హాలీవుడ్ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు. గ‌త సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ప్ర‌స్తుతం సెట్స్ పైన ఉన్న సినిమాల‌పై ప్ర‌త్య‌క దృష్టి పెడుతున్నారు. స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ప్ర‌భాస్ ఖ్యాతిని మ‌రింత పెంచుతాయ‌నే విశ్వాసంతో ఉన్నారు.

గ‌త కొద్ది రోజులుగా మూవీ టీజ‌ర్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం టీజ‌ర్ విడుదల‌ చేశారు. టీజర్ హ‌లీవుడ్ రేంజ్‌లో ఉండ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే పండ‌గ చేసుకుంటున్నారు. అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘శాని డియోగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని రివీల్ చేశారు మేక‌ర్స్.

ప్ర‌స్తుతం టీజ‌ర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. టీజ‌ర్‌లో ప్రభాస్ లుక్స్, ఎంట్రీ అదిరి పోయాయి. దీపికా పదుకొనే పాత్ర కూడా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అంటూ ఒక‌త‌ను అన‌డం.. ఆ తర్వాత సినిమా టైటిల్ కల్కీ పేర్కొంటూ గ్లింప్స్ ముగియ‌డం ఫ్యాన్స్‌కి మాత్రం గూస్ బంప్స్ తెప్పించాయి. కల్కి 2898 ఏడీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ మాత్రం అద్భుతమైన విజువల్స్‌తో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉండ‌డంతో ఒక్క‌సారిగి మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఇక గ్లింప్స్ రిలీజ్ కి ముందు మేక‌ర్స్ దీపికా, ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌పై దారుణ‌మైన ట్రోలింగ్ న‌డిచింది.ఐర‌న్ మ్యాన్‌కి ప్ర‌భాస్ త‌ల అంటించినట్టు ఉందని కొంద‌రు కామెంట్స్ చేశారు. విప‌రీత‌మైన ట్రోలింగ్ న‌డ‌వ‌డంతో టీమ్ ఆ లుక్‌ను డిలీట్ చేసింది. త‌ర్వాత మరో లుక్‌ను వదలింది. కాని అది కూడా అలానే ఉండ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కాని గ్లింప్స్ చూశాక మాత్రం ఒక్కొక్క‌రికి గూస్ బంప్స్ వ‌స్తున్నాయి.

ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. మహానటి వంటి సూప‌ర్ హ‌ట్ తర్వాత సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న‌ట్టు గ్లింప్స్ ద్వారా చెప్పేశారు. అమితాబ్, క‌మ‌ల్ హాస‌న్ వంటి లెజండ‌రీ న‌టులు ఇందులో భాగం కావ‌డంతో మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు ఉన్నాయి.