Project K:అవెంజర్స్ రేంజ్‌లో ప్ర‌భాస్ లుక్.. ప్రాజెక్ట్ కెపై ఒక్క‌సారిగా పెరిగిన అంచ‌నాలు

Project K: బాహుబ‌లి త‌ర్వాత వ‌రుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్ర‌భాస్ హిట్,ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.. చివ‌రిగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే అనే చిత్రం చేస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండ‌గా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ […]

  • By: sn    latest    Jul 19, 2023 11:12 AM IST
Project K:అవెంజర్స్ రేంజ్‌లో ప్ర‌భాస్ లుక్.. ప్రాజెక్ట్ కెపై ఒక్క‌సారిగా పెరిగిన అంచ‌నాలు

Project K: బాహుబ‌లి త‌ర్వాత వ‌రుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్ర‌భాస్ హిట్,ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.. చివ‌రిగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే అనే చిత్రం చేస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండ‌గా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ,యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

శాన్ డియోగా కామిక్ కాన్ వేడుకల్లో భాగంగా యూఎస్‌ఏలో జులై 20న (ఇండియా టైమ్ జులై 21) ‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ అనౌన్స్ చేయబోతున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే అంత‌క‌ముందు చిత్ర ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించి పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. ఇప్పుడు రెబల్ స్టార్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.ఇందులో ప్రభాస్ మార్వెల్ హీరోలాగా , కొద్దిగా తీక్ష‌ణంగా చూస్తుంటే ఐరెన్ మ్యాన్ లా కనిపిస్తూ అదరగొట్టే లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

పోస్ట‌ర్‌కి హీరో అడుగుపెట్టాడు. ఇక ఆట మారబోతుంది.. అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు మేక‌ర్స్ . అయితే పోస్టర్ చూసిన వారంద‌రు అవెంజర్ లా కనిపిస్తున్నాడ‌ని, అద‌ర‌గొట్టే లుక్‌లో సూపర్ గా ఉన్నాడు అని పోస్ట‌ర్‌ని వైర‌ల్ చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం వేరే బాడీకి ప్ర‌భాస్ త‌ల‌ని అతికించిన‌ట్టు ఉంద‌ని, ప్ర‌భాస్ ప‌రువు ఎందుకు ఇలా గంగ‌లో క‌లుపుతున్నారంటూ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో చిత్రాన్నిరూపొందిస్తున్న‌ట్టు ప్ర‌చారం నడుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే ప్రత్యేక వ్యూహాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని అలరిస్తాయ‌ని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ.500 కోట్లు పైగానే బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.