Rani Mukerji | 80 ఏండ్లొచ్చినా.. షారుఖ్‌తో రొమాన్స్ చేస్తా: రాణీ ముఖర్జీ
Rani Mukerji | విధాత: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు షారుఖ్‌కు వీరాభిమాని రాణీ ముఖర్జీ. సినీరంగ ప్రవేశం చేసిన తర్వాత ఇద్దరి జోడీ బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరు కలిసి కుచ్ కుచ్ హోతా హై, కబీ అల్విదా నా కెహ్నా, చల్తే చల్తే, పహేలీ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో అభిమానులను అలరించారు. అయితే, షారుక్‌పై పలుమార్లు తన […]

Rani Mukerji |
విధాత: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు షారుఖ్‌కు వీరాభిమాని రాణీ ముఖర్జీ. సినీరంగ ప్రవేశం చేసిన తర్వాత ఇద్దరి జోడీ బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇద్దరు కలిసి కుచ్ కుచ్ హోతా హై, కబీ అల్విదా నా కెహ్నా, చల్తే చల్తే, పహేలీ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో అభిమానులను అలరించారు. అయితే, షారుక్‌పై పలుమార్లు తన అభిమానాన్ని చాటుకున్న ఈ బాలీవుడ్ రాణీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు 80 సంవత్సరాల వయసు వచ్చినా షారుక్‌తో రొమాన్స్ చేసేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.
రాణీ ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ Vs నార్వే చిత్రంలో మరోసారి తెరపై కనిపించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాతో పాటు రాణీ ముఖర్జీని షారుఖ్ ఖాన్ ప్రశంసలో ముంచెత్తాడు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే టీమ్ ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేసిందన్నారు.
నా రాణి.. క్వీన్‌లా ప్రధాన పాత్రలో మెరిసిందని, దర్శకురాలు ఆషిమా సున్నితత్వంతో కూడిన మానవ పోరాటాన్ని చూపించారు అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశాడు. షారుఖ్ ప్రశంసలపై ఓ ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీని ప్రశ్నించగా.. బాలీవుడ్ బాద్‌షాతో కలిసి మళ్లీ నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది. దయచేసి షారుఖ్ కోసం అద్భుతమైన మెచ్యూర్ ప్రేమ కథ రాయాలని రచయితలకు విజ్ఞప్తి చేసింది.
తాను షారుఖ్ ఖాన్‌తో రొమాన్స్ చేయడాన్ని ఎప్పుడూ ఇష్టపడతానని, ఇద్దరి వయసు పెరిగినా ఇదే ఫీలింగ్ ఉంటుందని, నాకు 80 ఏళ్లు వస్తే.. షారుఖ్‌కు 95 వస్తాయి.. అప్పుడు కూడా ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం జనవరి 25న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్‌తో పాటు దన్కీ అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇక రాణీ ముఖర్జీ మిసెస్ ఛటర్జీ Vs నార్వే చిత్రం విజయం సాధించడంతో ఆనందంలో మునిగి తేలుతున్నది. ఈ సందర్భంగా ముంబయిలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరీ ఈ ఈవెంట్‌కు తన అభిమాన నటుడిని ఆహ్వానిస్తుందా? లేదా చూడాలి మరి..!