Ranjith On Wheels | రంజిత్కుమార్ది వరంగల్‌లోని గీర్మాజీపేట. పేద కుటుంబం. కష్టనష్టాల నడుమ ఎం ఫార్మసీ చేశాడు. ఓవైపు చదువుకొంటూనే పార్ట్‌టైం జాబ్ చేసేవాడు. రంజిత్ తండ్రి రాములు సంపాదనంతా కొడుకు చదువు కోసమే ఖర్చు పెట్టాడు. దేశం మొత్తాన్నీ చుట్టి రావాలన్న తన తండ్రి చిరకాల కోరికను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు. మంచి ఉద్యోగం సంపాదించి తన కోసం జీవితాన్నే త్యాగం చేసిన తండ్రి కోరికను నెరవేర్చాలనుకొన్నాడు రంజిత్. అయితే, 2020లో కరోనాతో […]
Ranjith On Wheels |
రంజిత్కుమార్ది వరంగల్‌లోని గీర్మాజీపేట. పేద కుటుంబం. కష్టనష్టాల నడుమ ఎం ఫార్మసీ చేశాడు. ఓవైపు చదువుకొంటూనే పార్ట్‌టైం జాబ్ చేసేవాడు. రంజిత్ తండ్రి రాములు సంపాదనంతా కొడుకు చదువు కోసమే ఖర్చు పెట్టాడు. దేశం మొత్తాన్నీ చుట్టి రావాలన్న తన తండ్రి చిరకాల కోరికను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు. మంచి ఉద్యోగం సంపాదించి తన కోసం జీవితాన్నే త్యాగం చేసిన తండ్రి కోరికను నెరవేర్చాలనుకొన్నాడు రంజిత్.
అయితే, 2020లో కరోనాతో రాములు కన్నుమూశాడు. ఆ సంఘటనతో రంజిత్ ఒక్కసారిగా కుంగుబాటుకు గురయ్యాడు. తన తండ్రి చిరకాల వాంఛను తీర్చడానికి సిద్ధమయ్యాడు. వివిధ దేశాలు పర్యటించి తన యాత్రలో బాగంగా సింగపూర్ కి చేరుకున్న రంజిత్ ని తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు కలిసి అభినందించి శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రంతో పాటు కొంత నగదును అందజేశారు
ఈ సందర్భంగా రంజిత్ తన యాత్రకు సంబందించిన వివరాలు ఇక్కడి తెలంగాణ వారితో పంచుకొన్నారు. మరియు తనను సత్కరించి ప్రోత్సహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రంజిత్ ను కలిసి సత్కరించిన వారిలో తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ , ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త తో పాటు సొసైటీ సభ్యులు ప్రవీణ్ కుమార్ మామిడాల, రావుల సుగుణాకర్ రెడ్డి, కాల సంతోష్ రెడ్డి, చల్లా క్రిష్ణ మరియు సాయి కృష్ణ కొమాకుల మొదలగు వారు ఉన్నారు.