Rashmi Gautam | రష్మీ గౌతమ్: బాయ్స్ హాస్టల్‌లో బాయ్ ఫ్రెండ్‌.. బాగా గ్యాప్

Rashmi Gautam | బుల్లి తెర నుంచి వచ్చిన రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్నా చితకా సినిమాలు చేస్తూనే ఉంది. జబర్దస్త్ టీవీ షోతో చాలామందికి పరిచయం అయిన ఈ అమ్మడు.. నటిగా కొన్ని చిన్న సినిమాల్లో కనిపించింది. రీసెంట్‌గా చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా అని అనసూయలా మొత్తం బుల్లితెరను వదిలేయలేదు. తనకు నటిగా కెరియర్‌ను ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చిన బుల్లితెర మీద రష్మికి ఉన్న అభిమానమో […]

  • Publish Date - August 28, 2023 / 02:04 AM IST

Rashmi Gautam |

బుల్లి తెర నుంచి వచ్చిన రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్నా చితకా సినిమాలు చేస్తూనే ఉంది. జబర్దస్త్ టీవీ షోతో చాలామందికి పరిచయం అయిన ఈ అమ్మడు.. నటిగా కొన్ని చిన్న సినిమాల్లో కనిపించింది. రీసెంట్‌గా చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా అని అనసూయలా మొత్తం బుల్లితెరను వదిలేయలేదు.

తనకు నటిగా కెరియర్‌ను ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చిన బుల్లితెర మీద రష్మికి ఉన్న అభిమానమో లేక బాగా సినిమాల్లో బిజీ అయితే కానీ బుల్లితెరను వదలకూడదు అనుకుందో తెలియదు కానీ ఇంకా జబర్దస్త్, మిగతా షోలలో కనిపిస్తూనే ఉంది.

అలా అని సినిమాల్లో ఇవే పాత్రలు రావాలని, పట్టుకూడా ఏం లేదట.. ఎలాంటి పాత్రలు వచ్చినా నటించేయాలనే గట్టి పట్టుమీదనే ఉందట రష్మీ. ఈమధ్య తనను ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కాస్త తికమక పడుతూనే సమాధానం చెప్పింది రష్మీ. అదెంటంటే..

ఈ మధ్య మొదలైన కొత్త ట్రెండ్‌తో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రష్మీ. కన్నడ సినిమాలను తెలుగులో డబ్ చేసి వదులుతున్న ట్రెండ్ ఈ మధ్య బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.

ఈ కోవలోనే తెలుగులో విడుదలైన ‘కాంతార, కేజీఎఫ్, చార్లీ 777’ సినిమాలను తెలుగు మార్కెట్‌లో కూడా రిలీజ్ చేసి కలెక్షన్స్ కొట్టేస్తున్నారు. అయితే కన్నడలో ఓ ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాని తెలుగులోకి తెస్తున్నారు. ఇందులో రష్మీ గౌతమ్ ఓ చిన్న పాత్రలో నటించింది.

ఈ సినిమా కథాంశం నిజజీవితంలో జరిగిన యథార్థ గాథ.. ఓ బాయ్స్ హాస్టల్‌లో జరిగిన సంఘటన ఆధారంగా సాగుతుంది. ఇందులో రక్షిత్ శెట్టి, దివ్య స్పందన కన్నడ వెర్షన్‌లో అతిథి పాత్రల్లో నటించారు. ఇక తెలుగు వెర్షన్‌కి తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రష్మీ గౌతమ్ కూడా హాజరైంది.

ఇదే సందర్భంలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందన కాస్త వైరల్ అయింది. మీకు బాయ్స్ హాస్టల్‌లో ఉండే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగిన దానికి మొదట ప్రశ్న అర్థం కాక నేను ఎప్పుడూ హాస్టల్స్‌లో ఉండలేదు అని చెప్పింది. తర్వాత మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా బాయ్స్ హాస్టల్ లో ఉన్నారా? అని అడిగినప్పుడు.. బాయ్స్ హాస్టల్‌లో ఉన్న బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ అంటే చాలా గ్యాప్ వచ్చేసినట్టే.. నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని చెప్పింది.

ఇక సినిమాల్లో ఎలాంటి పాత్ర కోసం ఆఫర్ వచ్చినా ఆలోచించకుండా నటించేయాలని, లేకపోతే ప్రేక్షకులు గుర్తు పెట్టుకోరని చెప్పింది రష్మీ గౌతమ్. మొత్తంగా అయితే మళ్లీ రష్మీ సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటూ.. అనసూయ దారిలోనే నడుస్తుందన్నది మాత్రం ఇక్కడ అర్థమవుతోంది.

Latest News