Rashmika | రష్మిక నోటి నుంచి బూతులా.. స్టార్ హీరోయిన్ అయి ఉండి ఏంటి పిచ్చి పనులు..!
Rashmika: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించి ఆ తర్వాత వరుస విజయాలని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. నేషనల్ క్రష్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. దేశ వ్యాప్తంగా తన హవాను సత్తా చాటుతూ సోషల్ మీడియాలోనూ రష్మిక తెగ సందడి చేస్తుంది. పుష్ప సినిమాతో […]

Rashmika:
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించి ఆ తర్వాత వరుస విజయాలని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. నేషనల్ క్రష్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. దేశ వ్యాప్తంగా తన హవాను సత్తా చాటుతూ సోషల్ మీడియాలోనూ రష్మిక తెగ సందడి చేస్తుంది. పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ పీక్స్ లోకి వెళ్లింది. ఈ అమ్మడు 2023లో ‘వారిసు’, ‘మిషన్ మజ్నూ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులని పలకరించి. ఇవి ఆశించిన మేర ఫలితాలని అందించలేదు.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 అనే మూవీ చేస్తోంది. ఈ సినిమా హిట్ అయితే రష్మిక క్రేజ్ పీక్స్ లోకి వెళ్లడం ఖాయం. ఇక ఈ భామ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్ అనే మూవీనీ చేస్తోంది. ఈ సినిమాతో పాటు ‘రెయిన్‌బో’ అనే చిత్రం కూడా చేస్తుంది.
వీటిలో ఒక్కటి మంచి హిట్ అయిన కూడా రష్మిక క్రేజ్ పీక్స్ లోకి వెళ్లడం ఖాయం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది.ఇందులో ‘నమస్తే, ఎట్లా ఉన్నారు?’ అంటూ పద్ధతిగా మొదలెట్టి ఆ తర్వాత తెలంగాణ భాషలో .. ‘వచ్చేసెయ్, మస్తుంది, నీ అమ్మా, ఏంది?, కొడదాం’ అని గలగలా చెప్పి, కిలకిలా నవ్వేసింది.
అసలు రష్మిక ఎందుకలా మాట్లాడింది, ఏంటా బూతులు.. ఎవరిని తిట్టింది?.. ఈ అమ్మడు వీడియోని సరదా కోసమే అలా మాట్లాడిందా అనేది తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. క్యూట్ క్యూట్‌గా ఉండే రష్మిక నోటి నుంచి అలాంటి మాటలు వచ్చే సరికి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. ఇక రష్మిక కి ఇన్‌స్టాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 38.8 మిలియన్ల మంది ఈ అమ్మడిని ఫాలో చేస్తుండగా, రష్మికకి రోజురోజుకి భీబత్సంగా పెరిగిపోతున్నారు.
View this post on Instagram