Rashmika Mandanna | ఆ ఇద్దరు హీరోల సినిమాల్లో నటించే అవకాశం మిస్‌ చేసుకున్న రష్మిక.. ఎంతో బాధపడ్డానంటూ..!

Rashmika Mandanna | నేషనల్‌ క్రస్‌ రష్మిక మందన్న చేతిలో నాలుగు ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నది. కన్నడ చిత్రం కిట్టి పార్టీతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కన్నడలోనే మరో రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘చలో’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గీతా గోవిందం’తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లోనూ చెరగని ముద్ర వేసుకొని నేషనల్‌ క్రష్‌గా మారింది. […]

Rashmika Mandanna | ఆ ఇద్దరు హీరోల సినిమాల్లో నటించే అవకాశం మిస్‌ చేసుకున్న రష్మిక.. ఎంతో బాధపడ్డానంటూ..!

Rashmika Mandanna |

నేషనల్‌ క్రస్‌ రష్మిక మందన్న చేతిలో నాలుగు ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నది. కన్నడ చిత్రం కిట్టి పార్టీతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కన్నడలోనే మరో రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘చలో’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గీతా గోవిందం’తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లోనూ చెరగని ముద్ర వేసుకొని నేషనల్‌ క్రష్‌గా మారింది.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంతో రష్మిక క్రేజ్‌ మరింత పెరిగింది. ఇప్పటి వరకు దక్షిణాదిలో సందడి చేసిన రష్మిక బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇస్తున్నది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. బాలీవుడ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా మారింది.

ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా ముందుగా రష్మిక పేరునే పరిశీలించే స్థాయిలో ఉన్న నేషనల్ క్రష్ ఇద్దరు బడా హీరోల సరసన నటించే ఛాన్స్ చేసుకుందని చెప్పుకొచ్చింది. అందుకు చాలా బాధపడ్డానంటూ తెలిపింది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay dhalapathi) సరసన ‘మాస్టర్’లో నటించాల్సి ఉండేదని చెప్పింది. కానీ, అప్పుడు కుదరక వదులుకున్నట్టు పేర్కొంది.

తాజాగా ‘వారసుడు’లో నటించిన రష్మిక.. తన అభిమాన హీరోతో సినిమా చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో రష్మిక మందననే నటించాల్సి ఉండేదని, అందులోనూ నటించలేకపోయానని చెప్పింది.

అలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా.. కొద్దిలో మిస్ అయ్యిందని చెప్పు కొచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున సరసన పుష్ప-2తో పాటు బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ‘యానిమల్‌’, తెలుగులో రేయిన్‌ బో చిత్రంతో పాటు బ్లాక్‌బాస్టర్‌ దర్శకుడు అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో షాహీద్‌ కపూర్‌ హీరోగా నటించనున్న చిత్రంలోనూ రష్మిక కనిపించనున్నది.