RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం
ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి నిర్ణయాలను ప్రకటించిన శక్తికాంతదాస్ విధాత: మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటు (RBI Repo Rate) (ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నప్పుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు)మార్పు చేయకుండా 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి నిర్ణయాలను ఆర్బీఐ […]

- ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి నిర్ణయాలను ప్రకటించిన శక్తికాంతదాస్
విధాత: మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటు (RBI Repo Rate) (ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నప్పుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు)మార్పు చేయకుండా 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
ద్వైమాసిక ద్రవ్యపరపతి నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో 5 గురు సమర్థించినట్లు ఆయన పేర్కొన్నారు. 2023-24లో ఇదే తొలి ద్రవ్య పరపతి సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్ష సమావేశం ప్రారంభమైంది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ గత సంవత్సరం నుంచి కీలక వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నది. ఇప్పటివరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు విషయం తెలిసిందే. 2023 ఫిబ్రవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైంది. అంతక్రితం నెల ఇది 6. 52 శాతంగా ఉన్నది. ద్రవ్యోల్బణం లక్ష్య పరిధి అయిన 6.5 శాతం స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు ఆర్బీఐకి అనివార్యమైంది.