gold, silver price fall| మరింత పడిపోయిన బంగారం, వెండి ధరలు!

కొత్త ఏడాది జనవరి నెలలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తూ..పైపైకి పెరిగిపోయి సామాన్యులకు దూరమైన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. బులియన్ మార్కెట్ లో శుక్రవారం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి.. రూ.1,52,350కి పడిపోయింది. కిలో వెండి ధర రూ. 20,000 తగ్గి రూ.2,80,000కు పడిపోయింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 06, 2026, 10:14 am IST
Read Time: 3 mins
gold, silver price fall| మరింత పడిపోయిన బంగారం, వెండి ధరలు!

విధాత, హైదరాబాద్ : కొత్త ఏడాది జనవరి నెలలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తూ..పైపైకి పెరిగిపోయి సామాన్యులకు దూరమైన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర రూ.1,45,000పడిపోగా, తులం బంగారం ధర రూ.26,500తగ్గిపోయింది. బంగారం ధరలతో పోల్చితే వెండి ధర భారీగా పతనమవ్వడం వెండిపై పెట్టుబడులు పెట్టిన వారిని ఆందోళనకు గురి చేస్తుంది.

బులియన్ మార్కెట్ లో శుక్రవారం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి.. రూ.1,52,350కి పడిపోగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,900 తగ్గి.. రూ.1,39,650 కి పడిపోయింది.

మళ్లీ రూ.20 వేలు తగ్గిన కిలో వెండి ధర

కిలో వెండి ధర మరోసారి భారీగా తగ్గింది. శుక్రవారం కిలో వెండి ధర రూ. 20,000 తగ్గి రూ.2,80,000కు పడిపోయింది. జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,000కు పెరిగిన వెండి ధర స్వల్ప వ్యవధిలోనే రూ.1,45,000తగ్గిపోవడం వెండి ధరల భారీ పతనాన్ని చాటుతుంది.

తగ్గుదల తాత్కాలికమే

గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.అధిక ధరల వద్ద బంగారం, వెండి కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు పడిపోతున్న ధరలతో ఆందోళన చెందుతున్నారు. అయితే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS మాత్రం పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా వాటి ధరలు మరోసారి పెరుగుదల బాట పడుతాయని అంచనా వేస్తుంది.

వచ్చే ఐదు నెలల్లో బంగారం ధరలు ఔన్సుకు 6,200 డాలర్ల స్థాయిని చేరుకునే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS అంచనా వేస్తోంది.ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 25 శాతం పెరుగుదలగా భావిస్తున్నారు. అయితే వెండి ధరలు మాత్రం మరికొన్ని రోజులు తగ్గుదల బాటలోనే సాగుతాయని,ధరల పెరుగుదలకు సమయం పట్టవచ్చని పేర్కొంది.