RC 17: ప్రశాంత్ నీల్‌ శిష్యుడితో రామ్‌చరణ్‌ యాక్షన్ అడ్వెంచర్‌ !

విధాత, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రం తర్వాత ఆచార్య సినిమాలో నటించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్‌తో RC15 అనే సినిమా చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత కాగా పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వాస్తవానికి ఈ సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా శంకర్ ఇండియన్ 2ని ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. […]

RC 17: ప్రశాంత్ నీల్‌ శిష్యుడితో రామ్‌చరణ్‌ యాక్షన్ అడ్వెంచర్‌  !

విధాత, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రం తర్వాత ఆచార్య సినిమాలో నటించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్‌తో RC15 అనే సినిమా చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత కాగా పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వాస్తవానికి ఈ సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

అయితే అనుకోకుండా శంకర్ ఇండియన్ 2ని ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో రెండు చిత్రాల మధ్య క్ట్యాస్ వచ్చింది.దీంతో RC15 చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. అటు ఇండియన్ 2 RC 15 రెండింటి మధ్య శంకర్ నలిగిపోతున్నాడు. ఒక సినిమా గ్యాప్‌లో మరో సినిమా చేస్తున్నాడు.

ఇండియన్ 2కి బ్రేక్ వచ్చినప్పుడు RC15, దానికి బ్రేక్ వచ్చినప్పుడు ఇండియన్ 2 చిత్రాలు చేస్తు రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు. కాగా రామ్ చరణ్ నటిస్తున్న RC 15 చిత్రాన్ని ఎలాగైనా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. దీని తరువాత రామ్ చరణ్ RC 16ను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు.

ఇక RC17గా రామ్ చరణ్ కన్నడ దర్శకుడు నర్తనతో కలిసి పని చేయడానికి ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయిందని అంటున్నారు. కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌తో నర్తన ఇటీవల మఫ్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే చిత్రం కన్నడ నాట సంచలన విజయం సాధించింది. దీనినే బాలకృష్ణ వీరసింహారెడ్డిగా తెలుగులో తీశారు.

నర్తన్ KGF ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ శిష్యుడు. RC 17స్టోరీ చాలా విభిన్నంగా ఉంటుందని యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనేది తెలియాల్సి ఉంది.