ఎన్నికల వేళ.. భూముల క్రమబద్ధీకరణ! కలెక్టర్లను ఆదేశించిన CS
నెలాఖరులోగా పూర్తి కావాలి విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల క్రమబద్ధీకరణ (Land Regularisation) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ నెలాఖరు వరకు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం బీఆర్కే భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)శాంతికుమారి మంచిర్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. రాష్ట్ర […]

- నెలాఖరులోగా పూర్తి కావాలి
విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల క్రమబద్ధీకరణ (Land Regularisation) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ నెలాఖరు వరకు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం బీఆర్కే భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)శాంతికుమారి మంచిర్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో భూముల క్రమబద్ధీకరణ కోసం 58, 59, 76 జీవోలను తీసుకువచ్చింది. ఈ జీవోల ప్రకారం భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు తెలిపారు. ఈ జీవోల ప్రకారం వచ్చిన దరఖాస్తులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఈ జీవోలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయంలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్‌లతోపాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.