Renu Desai | మీకు అంత సీన్ లేదంటూ రేణూ దేశాయ్‌కి నెటిజ‌న్ల చుర‌క‌లు.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..!

Renu Desai: ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాలు తగ్గించినా కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. త‌న సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అఖీరా ఫోటోలు షేర్ చేస్తూ.. కాస్త డిఫరెంట్ గా కామెంట్లు పెడుతూ.. ట్యాగ్ లైన్స్ కూడా పెడుతూ ఉంటుంది. ఆ స‌మ‌యంలో అఖీరాని కొంతమంది జూనియర్ పవర్ స్టార్ అంటూ ప్ర‌శంసిస్తుంటారు. ఆ స‌మ‌యంలో నా బిడ్డను అలా పిలవకండి.. అతనికి […]

  • By: sn    latest    Jul 22, 2023 1:19 AM IST
Renu Desai | మీకు అంత సీన్ లేదంటూ రేణూ దేశాయ్‌కి నెటిజ‌న్ల చుర‌క‌లు.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..!

Renu Desai:

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాలు తగ్గించినా కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. త‌న సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అఖీరా ఫోటోలు షేర్ చేస్తూ.. కాస్త డిఫరెంట్ గా కామెంట్లు పెడుతూ.. ట్యాగ్ లైన్స్ కూడా పెడుతూ ఉంటుంది.

ఆ స‌మ‌యంలో అఖీరాని కొంతమంది జూనియర్ పవర్ స్టార్ అంటూ ప్ర‌శంసిస్తుంటారు. ఆ స‌మ‌యంలో నా బిడ్డను అలా పిలవకండి.. అతనికి సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ లేదు అంటూ ఫ్యాన్స్‌ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది రేణూ దేశాయ్. ఇక అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. త‌మ‌దైన శైలిలో విచిత్ర‌మైన కామెంట్స్ తో ఆమె స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తూ ఉంటారు.

తాజాగా రేణూ దేశాయ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేసింది. చాలా రోజుల తరువాత నేను ఇన్ స్టాగ్రాం డాష్ బోర్డును చెక్ చేయ‌గా, నాకు ఒక విష‌యం తెలిసింది. నన్ను ఫాలో కానీ మిలియన్ల మంది నా ప్రొఫైల్, పోస్టులను గమినిస్తూ వ‌స్తుండ‌డం నేను చూశాను. వారు నన్ను ఫాలో కాకపోయినా ఎందుకు ఇలా నా ప్రొఫైల్‌ను చెక్ చేస్తున్నారో ఏ మాత్రం అర్థం కావడం లేదు.. వారు అలా ఎందుకు చేస్తున్నారా? అని ఆలోచ‌న చేస్తున్నాను అంటూ రేణూ దేశాయ్ త‌న పోస్ట్‌లో తెలియ‌జేసింది.

కాగా, రేణూ దేశాయ్‌కి దగ్గరదగ్గరగా ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ఉండ‌గా, ఆమె పోస్టులను గత నెలలో మిలియన్ మందికి పైగా చూడ‌డంతో రేణూకి ఈ డౌట్ వ‌చ్చింది. అయితే దీనిపై స్పందించిన కొంద‌రు నెటిజ‌న్స్ .. ఇన్ స్టాగ్రాం అల్‌గారిథమ్ అలానే ఉంటుంది.. మనకు ఎక్కువ ఫాలోవర్లు లేకపోయినా కూడా మనం చేసే రీల్స్‌ను సాధార‌ణంగా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంటుంది..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అలా ఎక్కువ రీచ్ వచ్చినప్పుడు ఇలా జ‌రుగుతూ ఉంటుంది త‌ప్ప‌, మీ కోసమే ప్ర‌త్యేకంగా వచ్చి ఎవ్వరూ చూడరు.. మీకు అంత సీన్ లేదు లేండి.. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మాకు కూడా అప్పుడ‌ప్పుడు ఇలానే జరుగుతూ ఉంటాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన రేణూ దేశాయ్ ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. రవితేజ హీరోగా వస్తున్న టైగర్‌ నాగేశ్వర రావు చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నది.