నేను కొంతమందికి నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్‌ వేడుకల్లో గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు హాజరుకాని CM KCR , మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ప్రొటోకాల్ ప్రకారం పాల్గొన్న సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ , ఉన్నతాధికారులు విధాత: తెలంగాణ రాష్ట్రంలో 74వ గణతంత్ర వేడుకలు రాజ్ భవన్‌లో జరిగాయి. హైదరాబాద్‌లోని రాజభవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. గురువారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. ఆపై గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ […]

  • By: krs    latest    Jan 26, 2023 6:37 AM IST
నేను కొంతమందికి నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్‌ వేడుకల్లో గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు
  • రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు
  • హాజరుకాని CM KCR , మంత్రులు, ప్రభుత్వ పెద్దలు
  • ప్రొటోకాల్ ప్రకారం పాల్గొన్న సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ , ఉన్నతాధికారులు

విధాత: తెలంగాణ రాష్ట్రంలో 74వ గణతంత్ర వేడుకలు రాజ్ భవన్‌లో జరిగాయి. హైదరాబాద్‌లోని రాజభవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. గురువారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. ఆపై గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాజ్ భవన్‌లో జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో గవర్నర్‌ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రసంగం చివర్లో కూడా గవర్నర్ తెలుగులో మాట్లాడుతూ ముగించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందామని అన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నేను నచ్చక పోవచ్చు. కానీ, నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తాను.’’ అని గవర్నర్ తమిళిసై మాట్లాడారు.

‘ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది’ అని గవర్నర్‌ అన్నారు.

‘శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. వైద్యం, ఐటీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ అనుసంధానమై ఉంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్‌ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ ఎప్పటికప్పుడు అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భనన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తున్నాం’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు.

ప్రసంగంలో తెలంగాణ ప్రముఖ కవి దాశరథి క్రిష్ణమాచార్యను, సమ్మక్క, సారలమ్మ, కొమురం భీంలను తమిళిసై సర్మించుకున్నారు. ‘‘ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం అని అన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అన్నారు. అని అన్నారు.

గవర్నర్ తమిళిసై చేసిన ముఖ్యమైన కామెంట్స్‌ కొన్ని..

నేను కొంతమందికి నచ్చకపోవచ్చు..
తెలంగాణతో నాకున్నది మూడేళ్ల అనుబంధం కాదు.. పుట్టుక నుంచే ఉంది
నా పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ.
కొంతమందికి నేను నచ్చకపోవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలంటే నాకు ఎంతో ఇష్టం
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ
తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది..
నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం.. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తాను..
అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని, అభివృద్ధి అంటే జాతి నిర్మాణం
ఫామ్ హౌస్‌లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదు
రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలి.
తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు