రిటైర్డ్ MPDO రామకృష్ణయ్య హత్య: విధుల్లో నిర్లక్ష్యం.. SI సస్పెండ్

MPDO విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా బచ్చన్నపేట ఎస్ఐ నవీన్‌ కుమార్ ను విధుల్లో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ MPDO నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా అలసత్వం ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనతో పాటు గతంలో […]

  • By: krs    latest    Jun 22, 2023 4:45 AM IST
రిటైర్డ్ MPDO రామకృష్ణయ్య హత్య: విధుల్లో నిర్లక్ష్యం.. SI సస్పెండ్

MPDO

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా బచ్చన్నపేట ఎస్ఐ నవీన్‌ కుమార్ ను విధుల్లో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

మండలంలోని పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ MPDO నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా అలసత్వం ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ సంఘటనతో పాటు గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు, విధుల్లో ఆలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట ఎస్. ఐ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు సీపీ ప్రకటించారు.