Revolver Prabal | మృగాళ్ల నుంచి మహిళల రక్షణ కోసం.. ‘ప్రబల్ రివాల్వర్’.. మీరూ ట్రై చేయండి..!

Revolver Prabal | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో కూడా నిత్యం ఎక్కడో చోట దాడులు, లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మానవ మృగాలు రెచ్చపోతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లాంటి రాష్ట్రాల్లో హింస అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నది. రోజురోజుకు పెరుగుతున్న దాడుల నుంచి మహిళలు తమను తామే రక్షించుకునే పరిస్థితి నెలకొన్నది. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లిన సమయంలో ఎవరూ ఒకరు వెంట వెళ్లడం సాధ్యకాకపోవచ్చు. అయితే, ఆత్మరక్షణకు […]

  • By: Vineela |    latest |    Published on : Aug 17, 2023 3:12 AM IST
Revolver Prabal | మృగాళ్ల నుంచి మహిళల రక్షణ కోసం.. ‘ప్రబల్ రివాల్వర్’.. మీరూ ట్రై చేయండి..!

Revolver Prabal |

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో కూడా నిత్యం ఎక్కడో చోట దాడులు, లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మానవ మృగాలు రెచ్చపోతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లాంటి రాష్ట్రాల్లో హింస అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నది. రోజురోజుకు పెరుగుతున్న దాడుల నుంచి మహిళలు తమను తామే రక్షించుకునే పరిస్థితి నెలకొన్నది. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లిన సమయంలో ఎవరూ ఒకరు వెంట వెళ్లడం సాధ్యకాకపోవచ్చు.

అయితే, ఆత్మరక్షణకు కోసం శిక్షణ తీసుకున్నా.. లేదంటే ఏవైనా రక్షణ వస్తువులను తీసుకెళితే ఎంతో ప్రయోజనం కలుగనున్నది. మహిళలకు ఆత్మరక్షణ కోసం ఓ సంస్థ గన్‌ను రూపొందించింది. ఉత్తరప్రదేశ్‌ కాన్ఫూర్‌లోని ప్రభుత్వ యాజమాన్య సంస్థ అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ రివాల్వర్‌ను తయారు చేసింది. దీనికి ‘ప్రబల్‌’గా నామకరణం చేసింది. ఇది భారత్‌లో లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌. ఈ నెల 18న విడుదలకానున్నది.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పునర్నిర్మాణంలో భాగంగా 2021లో ఏడు పీఎస్‌యూలను ఏర్పాటు చేసింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో ఏ
AWEIL (Advanced Weapons and Equipment India) సైతం ఒకటి. ఇది భద్రతా దళాలతో పాటు ఇతర దేశాలకు చెందిన ఆయుధాలను తయారు చేసి ఇస్తుంది. ఏడాదిలో కేంద్రం నుంచి రూ.6వేలకోట్ల ఆర్డర్లు.. మరో రూ.450కోట్ల ఆర్డర్లను ఇతర దేశాల నుంచి సైతం వచ్చాయి.

మహిళలు ఉపయోగించేలా అనువుగా ‘ప్రబల్‌’..

మహిళలు ఉపయోగించేందుకు అనువుగా ప్రబల్‌ రివాల్వర్‌ను రూపొందించింది. దీని బరువుతో పాటు సైతం తక్కువగానే ఉంటుంది. కేవలం 76 మిల్లీమీటర్ల సైజు ఉండగా.. బరువు 700 గ్రాములు. లైసెన్స్‌ గన్‌ను కొనుగోలు చేస్తే ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రబల్‌ గన్‌పై మహిళలు ఆసక్తి చూపే అవకాశం ఉందని సంస్థ అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ భావిస్తుంది.

గతంలో తయారు చేసిన రివాల్వర్‌ రేంజ్‌ 20 మీటర్లు ఉండగా.. కొత్త వర్షన్‌ రివాల్వర్‌ రేంజ్‌ దాదాపు 50 మీటర్ల వరకు ఉండనున్నది. గన్‌ కావాలనుకునే వారు లైసెన్స్‌ తీసుకొని కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వ యాజమాన్యంలోని అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.