Hrithik Roshan | మాజీ భార్య, ప్రస్తుత ప్రియురాలు ఒకే ఫ్రేమ్‌లో .. హృతిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
Hrithik Roshan | సాధారణంగా సినీ సెలబ్రిటీ జంటలు విడిపోయిన తర్వాత ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. విడాకుల అనంతరం ఒక్కొక్కరు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలు మొదలుపెట్టినా, మాజీ భాగస్వాములతో సన్నిహితంగా ఉండేందుకు చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా కొత్త పార్ట్నర్ ఉన్నప్పుడు, పాత బంధాలను దూరంగా పెట్టడం సహజమేనన్న అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది.
Hrithik Roshan | సాధారణంగా సినీ సెలబ్రిటీ జంటలు విడిపోయిన తర్వాత ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. విడాకుల అనంతరం ఒక్కొక్కరు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలు మొదలుపెట్టినా, మాజీ భాగస్వాములతో సన్నిహితంగా ఉండేందుకు చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా కొత్త పార్ట్నర్ ఉన్నప్పుడు, పాత బంధాలను దూరంగా పెట్టడం సహజమేనన్న అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాత్రం ఈ సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇటీవల హృతిక్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆ ఒక్క ఫ్రేమ్‌లో హృతిక్ ప్రస్తుత ప్రియురాలు సబా ఆజాద్‌తో పాటు, మాజీ భార్య సుసాన్ ఖాన్ కూడా కనిపించారు. అంతేకాదు, సుసాన్ ప్రస్తుత పార్ట్నర్ కూడా అదే వేడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు, సన్నిహితులు అందరూ కలిసి ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫోటో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ వ్యవహారాన్ని విమర్శిస్తున్నారు. విడాకుల తర్వాత ఇలా అందరూ కలిసి కనిపించడం పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చని, సెలబ్రిటీలు అయినా సరే కొన్ని హద్దులు పాటించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఇది చాలా పరిపక్వమైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.
హృతిక్ అభిమానులు మాత్రం ఈ వ్యవహారానికి గట్టిగా మద్దతు ఇస్తున్నారు. విడాకులు తీసుకున్నా, సహ తల్లిదండ్రులుగా పిల్లల కోసం మంచి సంబంధాన్ని కొనసాగించడం తప్పేం కాదని అంటున్నారు. వ్యక్తిగత జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పరుచుకుంటూనే, పిల్లలకు తల్లిదండ్రులుగా అండగా ఉండటం ఆరోగ్యకరమైన విషయమేనని అభిప్రాయపడుతున్నారు. అలాగే, పరస్పర అంగీకారంతో విడిపోయిన తర్వాత ఎవరి జీవితంలోకి వారు కొత్త వ్యక్తులను ఆహ్వానించడంలో తప్పేమీ లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram