Mowgli TEASER: రోష‌న్ క‌న‌కాల‌.. ’మోగ్లీ‘ టీజ‌ర్

  • By: sr    latest    Feb 14, 2025 11:30 PM IST
Mowgli TEASER: రోష‌న్ క‌న‌కాల‌.. ’మోగ్లీ‘ టీజ‌ర్

విధాత‌: క్యారెక్ట‌ర్ న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌, యాంక‌ర్‌ సుమ‌ల కుమారుడు రోష‌న్ (Roshan Kanakala) హీరోగా రెండో ప్ర‌య‌త్నంగా రూపొందుతున్న నూత‌న చిత్రం మోగ్లీ (Roshan Kanakala. గ‌తంలో క‌ల‌ర్ ఫొటో వంటి క్లాసిక్ చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

వాలంటైన్ డేను పుర‌ష్క‌రించుకుని శుక్ర‌వారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ టీజ‌ర్ రిలీజ్ చేశారు. పీపుల్స్ మీడియా డ్యాన‌ర్‌పై విశ్వ ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌రాఠి ముద్దుగుమ్మ సాక్షి సాగ‌ర్ మ‌దోల్క‌ర్ (Sakshi Sagar Mhadolkar) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. #Mowgli