Jaipur Mumbai Express | రన్నింగ్ ట్రైన్‌లో.. నలుగురిని కాల్చి చంపిన రైల్వే కానిస్టేబుల్
Jaipur Mumbai Express | జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. RPF ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులకు పాల్పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దహిసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో అతన్ని […]
Jaipur Mumbai Express |
- జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు..
- RPF ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి
జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులకు పాల్పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల అనంతరం దహిసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో అతన్ని వెంబడించి పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను చేతన్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ కాల్పుల ఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత చోటు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. ఈ రైలు జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram