RRR, Bandi Snjay: దేశమంతా RRR సంబురం.. తెలంగాణలో సంజయ్‌పై సెటైర్ల యుద్ధం.. ఎందుకంటే?

విధాత‌: బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు ఉత్తమ పాటగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నది. దీంతో RRR సినిమా డైరెక్టర్‌ రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, గేయ రచయిత చంద్రబోసు, పాట పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌ రక్షిత్‌లను దేశంలోని రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, భారతీయ సినీ పరిశ్రమలోని నటులు, దర్శకులు ఇలా అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే ఈ సంతోష సమయంలోనూ […]

RRR, Bandi Snjay: దేశమంతా RRR సంబురం.. తెలంగాణలో సంజయ్‌పై సెటైర్ల యుద్ధం.. ఎందుకంటే?

విధాత‌: బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు ఉత్తమ పాటగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నది. దీంతో RRR సినిమా డైరెక్టర్‌ రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, గేయ రచయిత చంద్రబోసు, పాట పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌ రక్షిత్‌లను దేశంలోని రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, భారతీయ సినీ పరిశ్రమలోని నటులు, దర్శకులు ఇలా అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

అయితే ఈ సంతోష సమయంలోనూ ఒక వ్యక్తిపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఆయన ఎవరో కాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఈ సినిమా విడుదల సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే బరిసెలతో కొట్టి కొట్టి చంపుతామని హెచ్చరించారు. అయితే ఇప్పుడా విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు నాటు నాటు పాటకు అవార్డు రావడం పై చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూనే.. బండి సంజయ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఒక ప్రజాప్రతినిధిగా, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కొన్ని విషయాల్లో అవగాహన‌ లేమితో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇవి పెద్ద దుమారాన్ని రేపుతుంటాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బండి పోతే బండి, కారు పోతే కారు అన్న ఆయన హామీపై నెటిజన్లు, విపక్ష నేతలు ఒక ఆట ఆడుకున్నారు.

తాజాగా మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక్క రోజు దీక్ష చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆమె పార్లమెంటులో మాట్లాడిన మొత్తం రికార్డులు తీపించానని ఎన్నడూ దానిపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌, జాగృతి శ్రేణులు కవిత పార్లమెంటులో మహిళా బిల్లుపై మాట్లాడిన వీడియో క్లిప్‌ను జత చేసి సంజయ్‌పై పంచ్‌లు పేల్చారు.

RRR సినిమాకు ఆస్కార్‌ అవార్డు.. మా బండన్న భాషకు బద్దం భాస్కర్‌ అవార్డు ఇస్తారా? అని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మీమ్స్, రీల్స్‌ చేస్తూ ఇవాళ ఆయనను ట్రోల్‌ చేస్తున్నారు. కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కూడా నిన్న సంజయ్‌ సామెతలు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. RRR సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంలో దేశమంతా ఆనందంతో ఉప్పొంగుతున్న ఈ సమయంలోనూ సంజయ్ నెటిజన్లకు టార్గెట్‌ కావడం ఆయన నోటి దురుసే కారణమంటున్నారు.