లహరి బస్సుల్లో 10శాతం రాయితీ: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండి వీసీ.సజ్జనార్ ప్రకటించారు

  • By: Somu    latest    Mar 06, 2024 12:59 PM IST
లహరి బస్సుల్లో 10శాతం రాయితీ: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

విధాత, హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండి వీసీ.సజ్జనార్ ప్రకటించారు. సాధారణ టికెట్‌ ధరలో ప్రయాణికులు బుక్‌ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆర్టీసీ కల్పించిందని తెలిపారు. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు.


లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయని పేర్కోన్నారు. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు.