Rythu Bharosa: రైతుల అకౌంట్లలోకి డబ్బులు!

Rythu Bharosa: రైతుల అకౌంట్లలోకి డబ్బులు!

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా పెండింగ్ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 23నుంచి పెండింగ్ రబీ సీజన్ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ఇప్పటిదాక మూడున్నర ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రూ.4 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇక 4 ఎకరాలు ఆపైన ఉన్నవారికి పెట్టుబడి సాయం అందించనుంది.

4ఎకరాలు..ఆపైబడిన రైతులు 35లక్షల మంది వరకు ఉన్నారని..వారందరికి ఈ నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యంకాని భూములు మినహాయించగా..కోటిన్నర ఎకరాల వరకు రైతు భరోసా వర్తించనుంది. ఇందుకు రూ.9వేల కోట్ల మేరకు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.12వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.