త్వరలో ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలను త్వరలో చేపడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
- వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
విధాత: ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలను త్వరలో చేపడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బస్ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా దశల వారీగా 2375 బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని48 గంటల్లో దిగ్విజయంగా అమలు చేశామన్నారు. రాష్ట్రంలో 7200 బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram