Site icon vidhaatha

ఎంత ప‌ని చేశావ్ స‌మంత‌.. ఇక నాగ చైత‌న్య‌తో పూర్తిగా విడిపోయిన‌ట్టేనా?

అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. త‌న డైవ‌ర్స్, సినిమాలు, ఆరోగ్యం విష‌యంతో అంద‌రి నోళ్ల‌లో నానుతూ వ‌స్తుంది.ఏ మాయ చేశావే సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన స‌మంత ఆ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో నాగ చైత‌న్య‌తో ప్రేమలో ప‌డింది. అప్ప‌టి నుండి వారు దాదాపు ప‌దేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారు. ఇక పెద్ద‌ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లైన నాలుగేళ్ల‌కి కొన్ని కార‌ణాల వ‌ల‌న విడాకులు తీసుకొని సింగిల్‌గా ఉంటున్నారు. అయితే నాగ చైత‌న్య‌- స‌మంత విడిపోవ‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. వారిద్ద‌రు క‌లిస్తే బాగుంటుంద‌ని, ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని చెప్పుకొస్తున్నారు.


ఈ మధ్య నాగ చైత‌న్య‌, స‌మంత మ‌ధ్య అండర్‌స్టాండింగ్ కుదిరింద‌ని, త్వ‌ర‌లో మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారాలు సాగాయి. సమంత వద్ద ఉంటే పెట్‌ డాగ్‌ హష్‌ నాగచైతన్య వద్ద క‌నిపించ‌డంతో ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూరింది. కాని అంత‌లోనే స‌మంత తుస్సుమ‌నిపించింది. ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉండే స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ సంద‌డి చేస్తుంది. అప్పుడప్పుడు త‌న క్యూట్ ఫొటోల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. రీసెంట్‌గా ప్రింక్ క‌ల‌ర్ సారీలో దిగిన కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో స‌మంత చాలా హోయ‌లు పోతున్న‌ట్టుగా క‌నిపించింది. ఈ పిక్‌లో స‌మంత శ‌రీరంపై నాగ చైత‌న్య టాటూ లేక‌పోవ‌డంతో ఇక వీరిద్ద‌రు క‌లవ‌డం అసాధ్యం అని డిసైడ్ అయ్యారు.


గతంలో సమంత‌ షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె శరీరంపై అక్కినేని నాగచైతన్య పచ్చ చొట్టు క‌నిపించేది. విడాకులు తీసుకున్న త‌ర్వాత కూడా ప‌లు సంద‌ర్భాల‌లో ఈ ట్యూటూ స‌మంత శ‌రీరంపై కనిపించేది. చైతన్యపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయ‌నని మ‌ర‌చిపోలేక‌ సామ్ ఈ ట్యాటూను అలాగే ఉంచుకుందంటూ ఫ్యాన్స్ కూడా సంతోషించారు. కాని తాజా ఫొటోల‌లో స‌మంత శ‌రీరంపై చైత‌న్య టాటూ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు ఇక క‌ల‌వ‌ర‌ని,చైత‌న్య జ్ఞాప‌కాల‌ని ఆమె పూర్తిగా చెరిపేసుకుంటుంద‌ని భావిస్తున్నారు. మొత్తానికి స‌మంత షేర్ చేసిన పిక్స్‌తో మ‌రోసారి ఈ క్యూట్ కపుల్ మ‌రోసారి వార్త‌ల‌లోకి ఎక్కారు. ఇక స‌మంత మ‌యోసైటిస్ వ్యాధితో బాధ‌ప‌డుతుండ‌గా, ఆమె ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి షికార్లు కొడుతుంది. ఇక నాగ చైత‌న్య చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. 

Exit mobile version