Sampath Jayaram | సినిమా పరిశ్రమలో విషాదం.. ‘అగ్నిసాక్షి’ ఫేమ్ సంపత్ ఆత్మహత్య..!
Sampath Jayaram | సినిమా పరిశ్రమను విషాదకర ఘటనలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు తుదిశ్వాస విడువగా.. తాజాగా యువనటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నడ (Kannada) టీవీ పరిశ్రమలో సంపత్ జయరామ్ (Sampath Jayaram) పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ముఖ్యంగా కన్నడలో అగ్నిసాక్షి (Agnisakshi) సీరియల్‌తో మంచి గుర్తింపు వచ్చింది. సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లోనూ నటించాడు. అయితే, సంపత్ బెంగళూరులోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 35 సంవత్సరాల వయసులో ఆత్మహత్య […]

Sampath Jayaram | సినిమా పరిశ్రమను విషాదకర ఘటనలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు తుదిశ్వాస విడువగా.. తాజాగా యువనటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నడ (Kannada) టీవీ పరిశ్రమలో సంపత్ జయరామ్ (Sampath Jayaram) పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.
ముఖ్యంగా కన్నడలో అగ్నిసాక్షి (Agnisakshi) సీరియల్‌తో మంచి గుర్తింపు వచ్చింది. సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లోనూ నటించాడు. అయితే, సంపత్ బెంగళూరులోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
35 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. అయితే, సంపత్‌కు ఏడాది కిందట వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. తనకు ఇక అవకాశాలు రావేమోనని కుంగిపోయాడు.
ఊహించినట్లే అవకాశాలు తగ్గడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని సన్నిహితులు పేర్కొంటున్నారు. సంపత్ మృతితో కుటుంబం షాక్‌కు గురైంది. పలువురు కన్నడ సినీ, టీవీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.