Sejal | న్యాయం కావాలని ఫ్ల కార్డులతో ఆందోళన అరిజన్ డెయిరీకి అమ్మిన భూములను ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ శేజల్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు Sejal | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి ఆరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తనకు […]
Sejal |
Sejal | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి ఆరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శేజల్ మాట్లాడుతూ తనకు ఎక్కడ ఫిర్యాదు చేసిన న్యాయం చేయడం లేదని ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనతోపాటు ఎమ్మెల్యే లైంగిక వేధింపుల జాబితాలో మరికొందరు బాధితులు ఉన్నారని ఆరోపించారు.
లైంగిక వేధింపుల విషయంలో ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నిస్తే ఆమెనే అడగండని చెప్తున్న నేపథ్యంలో నేనే ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య తమ సంస్థకు భూమిని అమ్మి, అదే భూమిని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
ఒక భూమిని ఎన్నిసార్లు విక్రయిస్తాడని ప్రశ్నించారు. ఏడు నెలల నుండి న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, పోలీసులు తనని అరెస్టు చేసి మూడు రోజులు కస్టడీకి తీసుకొని జైలుకు పంపించారని తెలిపారు.
ఎమ్మెల్యే అనుచరులు బీమా గౌడ్, రాజు మరికొంతమంది తన ఇంటికొచ్చి బెదిరించారని పేర్కొన్నారు. ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందే న్యాయం కోసం ఆందోళన చేస్తున్నానని, ఎమ్మెల్యే కు సపోర్ట్ చేయడానికి సిగ్గుండాలని పేర్కొన్నారు. మీ ఇంట్లో నాలాగే ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఇలాగనే సపోర్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.
తను ఎమ్మెల్యే ఇంటి వద్దనే న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, ఎమ్మెల్యేకు దమ్ముంటే నాకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తున్న శేజల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.