Road Accident | సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
విధాత: తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కొత్తపేట వద్ద ప్రమాదం తృటిలో తప్పింది. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు.
ఖైరతాబాద్‌లో ఆసుపత్రిలో ఒక మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వస్తుండగా తను ప్రయాణిస్తున్న కారు కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలోటైరు పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్‌కు, మెట్రో రైలు పిల్లరుకు గుద్దుకన్నది. కారు ఎయిర్ బేలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. పల్లె రవి కుమార్‌తో పాటు ఆయన మిత్రుడు రాజు, డ్రైవరు ఖదీర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram