TSPSC: పేపర్ల లీకేజీపై బండి సంజ‌య్‌కి సిట్ నోటీస్‌లు

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆరోపణలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయన్న బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సీట్ కోరింది. ఇప్పటికే సిట్ రేవంత్ రెడ్డికి సైతం ఇదే తరహాలో నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఈనెల 23న హాజరుకావాలని, ఆయన కూడా […]

TSPSC: పేపర్ల లీకేజీపై బండి సంజ‌య్‌కి సిట్ నోటీస్‌లు

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆరోపణలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయన్న బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సీట్ కోరింది.

ఇప్పటికే సిట్ రేవంత్ రెడ్డికి సైతం ఇదే తరహాలో నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఈనెల 23న హాజరుకావాలని, ఆయన కూడా తాను పేపర్ లీకేజీ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు అందించాలని సిట్ నోటీసులు ఇచ్చింది.