Sharad Pawar | కేసీఆర్ బలప్రదర్శన సరికాదు.. 600 కార్ల కాన్వాయ్‌పై శరద్‌పవార్ వ్యాఖ్య
విధాత: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ (Sharad Pawar) స్పందించారు. భారీ వాహన శ్రేణితో కేసీఆర్ చేసిన ఈ బల ప్రదర్శన సరికాదని వ్యాఖ్యానించారు. దక్షిణ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఉన్న పండరీపురం క్షేత్రాన్ని కేసీఆర్ సోమవారం దర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని విస్తరించే క్రమంలో భాగంగా 20 కి.మీ. రోడ్డు షో […]

విధాత: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ (Sharad Pawar) స్పందించారు. భారీ వాహన శ్రేణితో కేసీఆర్ చేసిన ఈ బల ప్రదర్శన సరికాదని వ్యాఖ్యానించారు.
దక్షిణ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఉన్న పండరీపురం క్షేత్రాన్ని కేసీఆర్ సోమవారం దర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని విస్తరించే క్రమంలో భాగంగా 20 కి.మీ. రోడ్డు షో నిర్వహించారు. తెలంగాణ నుంచి సుమారు 600 కార్లతో ఆయన మహారాష్ట్రలోకి ప్రవేశించడం విశేషం.
దీనిపై శరద్‌పవార్ మాట్లాడుతూ.. ‘పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయ దర్శనానికి వస్తే ఇబ్బందేమీ లేదు. కానీ భారీ సంఖ్యలో వాహనాలతో బల ప్రదర్శనకు యత్నించడమే చింతించాల్సిన విషయం’ అని వ్యాఖ్యానించారు.
ముందుగా కేసీఆర్ రెండు రాష్ట్రాల మధ్య సమన్వయానికి కృషి చేయాలని సూచించారు. ఎన్సీపీ టికెట్‌పై గెలిచి ఇటీవలే బీ ఆర్ ఎస్‌లోకి మారిన భాగీరథ్ బాల్కే గురించి విలేకర్ల అడగగా.. వ్యక్తులు పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.