DGP Anjani kumar: SI అభ్యర్థులూ.. 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లండి

రేపు ప్రధాని పర్యటన దృష్ట్యా నగరంలో పలుమార్గాల్లో ట్రాఫిక్‌ అంక్షలు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే వెళ్లాలని డీజీపీ సూచన విధాత‌: ఎస్‌ఐ పరీక్ష రాసే అభ్యర్థులకు డీజీపీ అంజనీకుమార్‌ సూచనలు చేశారు. రేపు ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలో ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఎస్‌ఐ పరీక్ష రాసే అభ్యర్థులు చాలా ముందుగా బయలుదేరారని డీజీపీ సూచించారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో కొన్ని రోడ్లను మూసివేస్తారని, దారి మళ్లించే మార్గాల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎస్‌ఐ అభ్యర్థులు […]

DGP Anjani kumar: SI అభ్యర్థులూ.. 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లండి
  • రేపు ప్రధాని పర్యటన దృష్ట్యా నగరంలో పలుమార్గాల్లో ట్రాఫిక్‌ అంక్షలు
  • అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే వెళ్లాలని డీజీపీ సూచన

విధాత‌: ఎస్‌ఐ పరీక్ష రాసే అభ్యర్థులకు డీజీపీ అంజనీకుమార్‌ సూచనలు చేశారు. రేపు ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలో ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఎస్‌ఐ పరీక్ష రాసే అభ్యర్థులు చాలా ముందుగా బయలుదేరారని డీజీపీ సూచించారు.

సికింద్రాబాద్‌ ప్రాంతంలో కొన్ని రోడ్లను మూసివేస్తారని, దారి మళ్లించే మార్గాల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎస్‌ఐ అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలి. 2 గంటల ముందే వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళిక చేసుకోవాలి.

ఎస్‌ఐ పోస్టులకు ఫైనల్‌ రాత పరీక్ష ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) గతంలోనే షెడ్యూల్‌ ప్రకటించింది. రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.