Coal | బొగ్గు ఉత్పత్తి ఆగొద్దు.. సింగరేణి సిఎండి శ్రీధర్ ఆదేశాలు

Coal విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ : వర్షాలు వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ఏరియాల వారీగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏరియాల వారిగా జనరల్ మేనేజర్స్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ […]

  • Publish Date - August 2, 2023 / 02:40 PM IST

Coal

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ : వర్షాలు వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ఏరియాల వారీగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏరియాల వారిగా జనరల్ మేనేజర్స్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన నీటిని తోడి బయటకు పంపించడానికి అవసరమైతే మరిన్ని పంపులను ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వర్షం వెలిసిన కొద్ది గంటల్లోనే తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి సంసిద్ధమై ఉండాలని సూచించారు. ఆగస్టు నెలలో రోజుకు కనీసం 1.95 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.90 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని, రోజుకు కనీసం 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగించాలని, అందుకు ప్రణాళికబద్ధంగా తగు చర్యలు చేపట్టాలని ఏరియాల జీఎంలను ఆదేశించారు.

వర్షాల తీవ్రతలో థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి నిరాటంకంగా సాగేందుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయటం కోసం కనీసం ఒక శాతం బొగ్గు అనగా ఐదు లక్షల టన్నుల బొగ్గును స్టాక్ గా ఉంచుకోవాలని ఆదేశించారు. అడ్రియాల లాంగ్ వాల్ భూగర్భ గనిలో తరచూ సమస్యలు ఉత్పత్నమవుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నిర్దేశిత రోజువారి బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా లక్ష్యాలు సాధించాలని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కనీసం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని దాటాలని పిలుపునిచ్చారు.

Latest News