సిరిసిల్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇష్టంతోనే జానీని పెళ్లి చేసుకున్నా : షాలిని
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మూడపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఓ యువతి కిడ్నాప్‌నకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 5:20 గంటలకు యువతి కిడ్నాప్‌నకు గురికాగా, మధ్యాహ్నం సమయానికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాను తన ప్రియుడు జానీని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని యువతి షాలిని ట్విస్ట్ ఇచ్చింది. ఇక ఆ వీడియోలు అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రసార మాధ్యమాల్లో వైరల్ […]

Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మూడపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఓ యువతి కిడ్నాప్‌నకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 5:20 గంటలకు యువతి కిడ్నాప్‌నకు గురికాగా, మధ్యాహ్నం సమయానికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాను తన ప్రియుడు జానీని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని యువతి షాలిని ట్విస్ట్ ఇచ్చింది. ఇక ఆ వీడియోలు అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మేమిద్దరం లవ్ చేసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది. అతనికి కాల్ చేస్తే వచ్చి నన్ను తీసుకెళ్లిండు. ఎవరూ బలవంతం చేయలేదు. మా తల్లిదండ్రుల నుంచి మాకు ప్రాణహానీ ఉంది. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. గతేడాది వివాహం చేసుకున్నాం. మా తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేం మైనర్లం కావడంతో జానీని జైలుకు పంపించారు. ఇప్పుడు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో వచ్చి తీసుకెళ్లమని జానీకి నేనే ఫోన్ చేసి చెప్పాను. నా కోరికపైనే జానీ నన్ను తీసుకెళ్లాడు. జానీ మాస్కు ధరించి రావడంతో గుర్తు పట్టలేకపోయాను. కారులో ఎక్కించిన తర్వాత జానీ మాస్కు తీయడంతో గుర్తు పట్టాను. ఆ తర్వాత జానీని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నాను. జానీ దళితుడైనందునే మా పెళ్లికి ఒప్పుకోలేదు అని షాలిని పేర్కొంది.
అసలేం జరిగిందంటే..?
మూడపల్లిలోని హనుమాన్ ఆలయానికి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రికుమార్తె వచ్చారు. దర్శనం అనంతరం గుడి బయటకు వస్తున్న యువతిని, మాస్కు ధరించి ఉన్న ఓ యువకుడు గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎత్తుకెళ్లి కారులో బలవంతంగా పడేశాడు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా కారులో ఎక్కారు. అడ్డుకోబోయిన తండ్రిని తోసేశారు. అనంతరం కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ తతంగమంతా పొద్దున 5:20 గంటలకు చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
అనుమానమే నిజమైంది..
తమ కుమార్తెను మూడపల్లికి చెందిన కట్కూరి జానీ(జ్ఞానేశ్వర్) కిడ్నాప్ చేసి ఉంటాడని తండ్రి అనుమానించాడు. ఏడాది క్రితం ఈ మాదిరిగానే తమ బిడ్డను తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని తెలిపాడు. అతని మీదనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుండగానే కిడ్నాప్‌నకు గురైన షాలిని, తాను జానీని పెళ్లి చేసుకున్నట్లు వీడియో విడుదల చేసింది.