Love Affair | వివాహేతర సంబంధం.. భర్త చెవులు కోసేసిన భార్య..!
Love Affair | మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. పంచ భూతాలసాక్షిగా మనువాడిన దంపతులు( Couples ).. మృగల్లా మారుతున్నారు. కట్టుకున్న భర్తలను( Husbands ) అతి కిరాతకంగా చంపేందుకు యత్నిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా( Mahabubabad district )లో ఓ భార్య( Wife ) తన భర్తను చంపేందుకు యత్నించింది.

Love Affair | మహబూబాబాద్ : వివాహేతర సంబంధాలు భార్యాభర్తల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలను ఎన్నో చూశాం.. చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం.. భర్త ప్రాణాల మీదకు తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన ఓ వివాహిత.. ఓ యువకుడిపై మనసు పారేసుకుంది. మనసు ఒక్కటే కాదు.. శారీరకంగా కూడా దగ్గరయ్యారు. అయితే వీరి వివాహేతర సంబంధాన్ని భర్త పసిగట్టాడు.
దీంతో భర్తను మందలించాడు. ఆ యువకుడితో మాట్లాడొద్దని హెచ్చరించాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి.. భర్తను చంపేందుకు భార్య కుట్ర చేసింది. ప్రియుడితో కలిసి చంపే క్రమంలో, భర్త చెవులు కోసేసింది భార్య. దీంతో ప్రాణభయంతో కేకలు పెడుతూ భర్త పరుగులు తీశాడు. అప్రమత్తమైన తండా వాసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రియుడిని పట్టుకుని స్థానికులు చితకబాదారు. బాధిత భర్త ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.