Road Accident | తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి ఆరుగురు దుర్మరణం

Road Accident | తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అనంతపల్లి శివారులో హైవేపై ఆగి ఉన్న లారీని కారు అదుపు తప్పి ఢీకొట్టింది. కారులో […]

Road Accident | తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి ఆరుగురు దుర్మరణం

Road Accident | తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అనంతపల్లి శివారులో హైవేపై ఆగి ఉన్న లారీని కారు అదుపు తప్పి ఢీకొట్టింది.

కారులో ఉన్న ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. మృతులో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సైతం ఉన్నది. ప్రమాదంలో మరో ఇద్దరికి గాలయ్యాయి. వారిని స్థానిక రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కొవ్వూరు డీఎస్పీ వర్మ వివరించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.