Snake | స్టేడియంలో కలకలం సృష్టించిన పాము.. ఉలిక్కిపడ్డ ఫీల్డర్
Snake | లంక ప్రీమియర్ లీగ్-2023లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. మ్యాచ్ కొనసాగుతుండగానే పాములు స్టేడియంలో ప్రత్యక్షమై ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జులైలో గాలే టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు పాము ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 12వన బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పాము ప్రత్యక్షమై.. ఆటగాళ్లను హడలిపోయేలా చేసింది. జాఫ్నా కింగ్స్ ఛేదనలో 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం […]
Snake | లంక ప్రీమియర్ లీగ్-2023లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. మ్యాచ్ కొనసాగుతుండగానే పాములు స్టేడియంలో ప్రత్యక్షమై ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జులైలో గాలే టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు పాము ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 12వన బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పాము ప్రత్యక్షమై.. ఆటగాళ్లను హడలిపోయేలా చేసింది. జాఫ్నా కింగ్స్ ఛేదనలో 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాండీ జట్టు పేసర్ ఇసురు ఉదాన ఫీల్డింగ్‌లో భాగంగా అటు ఇటు కదులుతుండగా అతని పక్కనే పాము ప్రత్యక్షమైంది. ఆ పామును చూసిన ఫీల్డర్ ఉలిక్కిపడి ముందుకు కదిలాడు. పాము తన దారిన తాను వెళ్లిపోయింది. పాము బౌండరీ వైపు వెళ్లిపోతుండటంతో.. కెమెరామెన్‌లు కూడా దూరంగా వెళ్లిపోయారు.
Snake in LPL…!!!!
A lucky escape for Udana. pic.twitter.com/R3Gg2yxVkh
— Johns. (@CricCrazyJohns) August 13, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram