Husband of the year | భార్య మేక‌ప్‌కు భ‌ర్త సాయం.. వీడియో వైర‌ల్

Husband of the year | మ‌హిళ‌లు త‌మ మేక‌ప్ కోసం గంట‌ల కొద్ది స‌మ‌యం కేటాయిస్తారు. చూడ‌టానికి అందంగా క‌నిపించాల‌నే ఉద్దేశంతో మ‌హిళ‌లు రెడీ అవుతుంటారు. పెళ్లిళ్ల‌కే కాదు.. షాపింగ్ మాల్స్‌కు వెళ్లినా కూడా మేక‌ప్ ఉండాల్సిందే. ఆ మాదిరిగానే ఓ మ‌హిళ కూడా స్టేడియానికి మేకప్‌తో వెళ్లారు. అంద‌రూ మ్యాచ్‌ను వీక్షిస్తుంటే.. ఆమె మాత్రం త‌న మేకప్‌పై దృష్టి సారించింది. అది కూడా త‌న భ‌ర్త సాయంతో. అందుబాటులో అద్దం లేక‌పోవ‌డంతో.. స్మార్ట్‌ఫోన్‌ను అద్దంగా […]

Husband of the year | భార్య మేక‌ప్‌కు భ‌ర్త సాయం.. వీడియో వైర‌ల్

Husband of the year | మ‌హిళ‌లు త‌మ మేక‌ప్ కోసం గంట‌ల కొద్ది స‌మ‌యం కేటాయిస్తారు. చూడ‌టానికి అందంగా క‌నిపించాల‌నే ఉద్దేశంతో మ‌హిళ‌లు రెడీ అవుతుంటారు. పెళ్లిళ్ల‌కే కాదు.. షాపింగ్ మాల్స్‌కు వెళ్లినా కూడా మేక‌ప్ ఉండాల్సిందే. ఆ మాదిరిగానే ఓ మ‌హిళ కూడా స్టేడియానికి మేకప్‌తో వెళ్లారు.

అంద‌రూ మ్యాచ్‌ను వీక్షిస్తుంటే.. ఆమె మాత్రం త‌న మేకప్‌పై దృష్టి సారించింది. అది కూడా త‌న భ‌ర్త సాయంతో. అందుబాటులో అద్దం లేక‌పోవ‌డంతో.. స్మార్ట్‌ఫోన్‌ను అద్దంగా మ‌లుచుకుంది. స్మార్ట్ ఫోన్ భ‌ర్త ప‌ట్టుకుని ఉండ‌గా.. అందులో చూసుకుంటూ ఐ లాసెష్‌కు ఆమె మేక‌ప్ వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

అయితే ప‌లు మ్యాచ్‌ల సంద‌ర్భంగా అమ్మాయిలు, అబ్బాయిలు త‌మ‌కు న‌చ్చిన వారికి ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డం చూశాం. కొన్ని సంద‌ర్భాల్లో గొడ‌వ‌లు ప‌డ‌టం చూశాం. కానీ ఈమె మాత్రం భ‌ర్త సాయంతో మేకప్ వేసుకుని వార్త‌ల్లో నిలిచింది.