ల్యాండ్‌మైన్ మీద కాలుపెట్టిన జవాన్ మృతి
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో నౌషేరా ప్రాంతం వద్ద పాత ల్యాండ్‌మైన్‌పై కాలు మోపిన ఓ సైనికుడు దుర్మరణం చెందాడు

- మరో ఇద్దరు సైనికులకు గాయాలు
- జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు
- సమీపంలోని నౌషేరా వద్ద ఘటన
విధాత: భారతదేశ సరిహద్దులో విషాద ఘటన చోటుచేసుకున్నది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో నౌషేరా ప్రాంతం వద్ద పాత ల్యాండ్‌మైన్‌పై కాలు మోపిన ఓ సైనికుడు దుర్మరణం చెందాడు. ఆయనతోపాటు ఉన్న మరో ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. వారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు.
దేశ సరిహద్దు వెంట బుధవారం రాత్రి సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సైనికుల్లో ఒకరు గతంలో ఎప్పుడో పాతిపెట్టిన ల్యాండ్‌మైన్‌పై అడుగు పెట్టాడు. అది ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలడంతో దూరంగా ఎగిరిపడ్డాడు. అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనతోపాటు ఉన్న మరో ఇద్దరు సహచరులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.
వారిని హుటాహుటిన ఆర్మీ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఒక జవాన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయపడిన మరో ఇద్దరు జవాన్లు చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనలో చనిపోయిన, గాయపడిన జవాన్ల వివరాలను ఆర్మీ ఇంకా వెల్లడించలేదు.