• Telugu News
  • /National

IED Blast | బీజాపూర్‌లో ఐఈడీ బ్లాస్ట్‌.. ఇద్దరు జవాన్లు వీరమరణం..!

IED Blast | ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరో నాలుగురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.

Reported by: Mallanna | జాతీయం | Jul 18, 2024, 11:21 am IST
Read Time: 3 mins
IED Blast | బీజాపూర్‌లో ఐఈడీ బ్లాస్ట్‌.. ఇద్దరు జవాన్లు వీరమరణం..!

IED Blast | ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరో నాలుగురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమాచారం ప్రకారం, బీజాపూర్‌ టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండిమార్క అటవీప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నుంచి తిరిగి వస్తున్న జవాన్లపై మెరుపుదాడి చేశారు. పైప్‌బాంబ్‌ను ఉపయోగించి ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సీఆర్‌పీఎఫ్‌, సీఏఎఫ్‌, డీఆర్‌జీ, ఎస్‌జీఎఫ్‌ బలగాలు నక్సల్స్‌ వ్యతిరేక సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

బుధవారం సెర్చ్‌ ఆపరేషన్‌ ముగించుకొని తిరిగి క్యాంప్‌లకు తిరిగి వస్తుండగా మండిమార్క అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ అమర్చిన పైపుబాంబ్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఎస్టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహు, కానిస్టేబుల్ సతేర్ సింగ్ వీరమరణం పొందారు. కాగా, పురుషోత్తం నాగ్, కోమల్ యాదవ్, సియారామ్ సోరి, సంజయ్ కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారిని రాయ్‌పూర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ పని చేయలేదు. ప్రస్తుతం సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు అధికారికంగా స్పందించలేదు.