ఒక్కోసారి జగన్ అంతే.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాడు! గవర్నర్‌కు పాదాభివందనం

విధాత‌: ఒక్కోసారి జగన్ అంతే.. ఎందుకో.. కారణం బయటకు తెలీదు కానీ కొన్ని విషయాల్లో.. కొందరు మనుషుల విషయంలో అమితంగా కనెక్ట్ అయిపోతాడు. ఎవరూ ఊహించని తీరులో కనెక్ట్ అయిపోతాడు. సదరు వ్యక్తి పట్ల జగన్‌కు ఇంత కాన్సర్న్ ఉందా? నిజమా అన్నంతగా అలుముకుంటాడు. దాదాపుగా ఎప్పుడో గానీ జగన్ ఎవరిపట్లా అమితమైన భక్తి, అచంచలమైన ప్రేమ చూపిన సందర్భాలు ఉండవు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆత్మీయ […]

  • By: Somu    latest    Feb 22, 2023 10:53 AM IST
ఒక్కోసారి జగన్ అంతే.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాడు! గవర్నర్‌కు పాదాభివందనం

విధాత‌: ఒక్కోసారి జగన్ అంతే.. ఎందుకో.. కారణం బయటకు తెలీదు కానీ కొన్ని విషయాల్లో.. కొందరు మనుషుల విషయంలో అమితంగా కనెక్ట్ అయిపోతాడు. ఎవరూ ఊహించని తీరులో కనెక్ట్ అయిపోతాడు. సదరు వ్యక్తి పట్ల జగన్‌కు ఇంత కాన్సర్న్ ఉందా? నిజమా అన్నంతగా అలుముకుంటాడు. దాదాపుగా ఎప్పుడో గానీ జగన్ ఎవరిపట్లా అమితమైన భక్తి, అచంచలమైన ప్రేమ చూపిన సందర్భాలు ఉండవు.

స్వరూపానంద స్వామి, చినా జీయర్ స్వామి వంటి వారి విషయంలో మినహా ఆయన ఎక్కడా వంగి భక్తి ప్రపత్తులతో నమస్కరించడం అరుదే. అప్పట్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు పాద న్మమస్కారం చేసినట్లున్నారు. ఇంకా మొదట్లో మోడీకి కూడా వంగి నమస్కారం చేయబోతే ఆయనే వారించారు. మళ్ళీ చాన్నాళ్లకు ఈరోజు గవర్నర్ హరిచందన బదిలీ సందర్భంగా జగన్ ఆయనకు పాదాభి వందనం చేసారు.

నిన్న విజయవాడలో జరిగిన ఆయన వీడ్కోలు సభలోనూ జగన్ ఉద్వేగంగా మాట్లాడారు.. ఆయన్ను తండ్రి సమానుడిగా భావిస్తూ ఆయన బదిలీ రాష్ట్రానికి పెద్ద లోతుగా పేర్కొన్నారు. ఈరోజు గవర్నర్ ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోతున్నా తరుణంలో జగన్ వంగి ఆయున కాళ్లకు నమస్కారం పెట్టారు. ఓ గవర్నర్‌కు ముఖ్యమంత్రి పాదాభి వందనం చేస్తున్నట్లు కాకుండా ఓ పెద్దాయనకు ఓ యువకుడు, కొడుకు సమానుడు భక్తితో వందనం చేస్తున్నట్లు భావించాలి.

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పటి గవర్నర్ నరసింహన్ కు పాద నమస్కారం చేశారు.

అంతే ఆయన విద్వత్ సంపన్నుడు, జ్ఞానీ అంటూ ఏదేదో వెర్షన్లు చెప్పారు కానీ జగన్ ఇప్పుడు అవేం లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఇలా వంగి నమస్కారం చేసినట్లు తెలుస్తోంది.