Sovereign Gold Scheme | బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? ఈ స్కీమ్ మీ కోసమే..! త్వరపడండి మరి..!
Sovereign Gold Scheme | బంగారంలో పెట్టుబడి పెట్టుదామని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. 2023-24 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సెకండ్ ఫేస్‌కు సంబంధించి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఈ నెల 15 ఈ గోల్డ్ బాండ్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. తక్కువ రాబడి వచ్చినా పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే బంగారం ధర పెరుగుదలతో వచ్చే లాభంతో రెండున్నర శాతం వడ్డీ సులభంగా పొందేవీలుంటుంది. అదే సమయంలో నష్టం భయాలు ఏమాతరం […]

Sovereign Gold Scheme |
బంగారంలో పెట్టుబడి పెట్టుదామని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. 2023-24 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సెకండ్ ఫేస్‌కు సంబంధించి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఈ నెల 15 ఈ గోల్డ్ బాండ్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. తక్కువ రాబడి వచ్చినా పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే బంగారం ధర పెరుగుదలతో వచ్చే లాభంతో రెండున్నర శాతం వడ్డీ సులభంగా పొందేవీలుంటుంది. అదే సమయంలో నష్టం భయాలు ఏమాతరం ఉండవు. ఆర్‌బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఈ నెల 11న ప్రారంభించింది.
ఎవరైనా ఈ పథకంలో చేరే వీలుంది. పథకంలో గ్రామం బంగారం బాండ్ ధరను రూ.5,293గా నిర్ణయించింది. గోల్డ్ బాండ్ స్కీమ్ ధరను నిర్ణయించేందుకు 999 ప్యూరిటీ గోల్డ్ రేటును ప్రామాణికంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. సబ్‌స్క్రిప్షన్ గడువైన సెప్టెంబర్ 6-8 వరకు ముందు బంగారం ముగింపును బట్టి.. గ్రాముకు రూ.5,923 నిర్ణయించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
అయితే, ఆన్‌లైన్ విధానంలో బాండ్లను కొనుగోలు చేస్తున్న వారికి ఆర్‌బీఐ రాయితీని ప్రకటించింది. ఒక గ్రాము బాండ్‌పై రూ.50 వరకు రాయితీ ఇస్తున్నది. దీంతో ఆన్‌లైన్‌లో ఇన్వెస్టర్లకు గ్రాము బాండ్ రూ.5,873కే అందుతుంది. ఈ బాండ్లు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL), పోస్టాఫీసులు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందుబాటులో ఉంటాయి.
సావరిన్ గోల్డ్ స్కీమ్ అంటే..
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ఆర్‌బీఐ ప్రారంభించదు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది బంగారం డిజిటల్ రూపంలో ఉంటుంది. భౌతికంగా కనిపించదు. చాలామంది భౌతికంగా బంగారాన్ని ఎక్కువ మొత్తంలో గృహాల్లో ఉంచుకునేందుకు సంకోచిస్తారు. దొంగల భయం తదితర కారణాలతో భద్రతా భావానికి గురవుతారు.
అయితే, ఫిజికల్ బంగారం కొనుగోళ్లను తగ్గించేందుకు తీసుకువచ్చిన పథకమే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. కేంద్రం తరఫున ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తూ ఉంటుంది. బంగారంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారు గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుబడి పెట్టి.. ఆయా బాండ్లను ఆర్‌బీఐ వద్దనే భద్రంగా ఉంచుకునేందుకు వీలుంటుంది.
అయితే, బాండ్లతో ప్రతి ఆరునెలలకోసారి 2.50శాతం ఫిక్స్‌డ్ రేట్‌తో వడ్డీ చెల్లిస్తారు. బాండ్ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కిస్తారు. వడ్డీని ప్రతి ఆరునెలలకోసారి జమ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ చేసుకునే వీలు సైతం ఉంటుంది. అయితే, భౌతికంగా బంగారం కొనుగోలు సమయంలో వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఈ గోల్డ్ బాండ్లకు వర్తించవు.
బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఉంటుంది. కొనుగోలు చేసి తేదీ నుంచి మూడేళ్ల ముందు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయిస్తే.. స్వల్పకాలిక మూలధనం లాభాల కింద వర్తించే శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల సంవత్సరాల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధనం లాభాల కింద 20శాతం వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది.