Actress | లెక్చరర్‌తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్.. పెళ్లైన కూడా అతను..
Actress | ఆహా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అయిన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌కు గతంలో మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్‌లో ఈ సిరీస్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఇదే సక్సెస్‌ను కొనసాగించేందుకు ‘త్రీ రోజెస్’ సీజన్ 2 సిద్ధమైంది.
Actress | ఆహా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అయిన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌కు గతంలో మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్‌లో ఈ సిరీస్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఇదే సక్సెస్‌ను కొనసాగించేందుకు ‘త్రీ రోజెస్’ సీజన్ 2 సిద్ధమైంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సిరీస్‌లో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు ముగించిన ఈ సీజన్ డిసెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సిరీస్ విడుదల దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సీజన్‌పై ఆసక్తి పెంచుతున్నారు.
క్రేజీ కామెంట్స్..
ఇదే క్రమంలో నటి రాశీ సింగ్ తన కాలేజ్ రోజుల్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.తన కాలేజ్ డేస్‌లో లెక్చరర్‌తో ప్రేమాయణం నడిపినట్టు రాశీ ఓపెన్‌గా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె మాట్లాడుతూ.. “స్కూల్ అయ్యాక కాలేజీలో చేరాను. అప్పట్లో నాకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనే మా లెక్చరర్. నాకు చాలా ఫేవర్‌గా ఉండేవాడు. ఎగ్జామ్స్‌లో ముందుగానే పేపర్లు ఇచ్చేవాడు. వైవాలో ప్రశ్నలు అడగకుండా తప్పించుకునేవాడు. ఇద్దరం కలిసి టైమ్‌పాస్ చేసుకుంటూ ఉండేవాళ్లం. నా వయసు అప్పట్లో 17… అతను కూడా చాలా యంగ్, పెళ్లి కాలేదు. అయినా మా మధ్య ఎలాంటి తప్పు వ్యవహారం జరగలేదు” అని చెప్పుకొచ్చింది.
తర్వాత ఆ లెక్చరర్ పెళ్లి చేసుకున్నారని, ఇప్పటికీ తనతో టచ్‌లోనే ఉంటారని రాశీ తెలిపింది. “ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన నన్ను ఫాలో అవుతున్నాడు… ఆయన వైఫ్ కూడా” అని చెప్పి నవ్వేసింది.రాశీ సింగ్ చెప్పిన ఈ వ్యక్తిగత విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ‘త్రీ రోజెస్’ సీజన్ 2లో ఈ ముగ్గురు నటీమణులు ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తారన్నది డిసెంబర్ 12న తేలనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram