Space Ex | విధుల నిమిత్తం.. అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు

Space Ex | విధాత: కేప్ కెనవేరాల్‌, కేప్ కెనవేరాల్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పెస్ ఎక్స్ రాకెట్ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. వారు ఆదివారం కక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టారు. మార్చి నెల నుంచి ఇప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యోమగాముల స్థానంలో ఆ నలుగురు వ్యోమగాములు బాధ్యతలు స్వీకరిస్తారు. వీరు ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. నలుగురిలో ఒకరు అమెరికా […]

  • By: krs    latest    Aug 27, 2023 4:45 PM IST
Space Ex | విధుల నిమిత్తం.. అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు

Space Ex |

విధాత: కేప్ కెనవేరాల్‌, కేప్ కెనవేరాల్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పెస్ ఎక్స్ రాకెట్ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. వారు ఆదివారం కక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టారు.

మార్చి నెల నుంచి ఇప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యోమగాముల స్థానంలో ఆ నలుగురు వ్యోమగాములు బాధ్యతలు స్వీకరిస్తారు. వీరు ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. నలుగురిలో ఒకరు అమెరికా నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు రష్యా, జపాన్‌, డెన్మార్క్ దేశాలకు చెందిన వారు.

తాజా బృందానికి నాసాకు చెందిన మెరైన్ జాస్మిన్ మేఘ్‌బలి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు నాసా పంపించిన స్పెస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు, ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తొలిసారిగా నాలుగు దేశాల వారిని అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌కు పంపించింది.