Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రారంభించిన స్పెషల్‌ ట్రైన్స్‌ను అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్- కటక్ (రైలు నంబర్‌ 07165) ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు, కటక్‌ - హైదరాబాద్‌ (రైలు నం. 07166) ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 పొడిగించినట్లు తెలిపింది. తిరుపతి - జాల్నా (07413) ఆగస్టు […]

Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రారంభించిన స్పెషల్‌ ట్రైన్స్‌ను అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్- కటక్ (రైలు నంబర్‌ 07165) ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు, కటక్‌ – హైదరాబాద్‌ (రైలు నం. 07166) ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 పొడిగించినట్లు తెలిపింది. తిరుపతి – జాల్నా (07413) ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు, జల్నా – తిరుపతి (07414) ఆగస్టు 6 నుంచి అక్టోబర్ ఒకటి వరకు నడువనున్నది.

జల్నా – చాప్రా ( 07651) రైలు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు, చాప్రా -జల్నా (07652) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగనున్నది. హైదరాబాద్ – గోరఖ్‌పూర్(02575) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు, గోరఖ్‌పూర్ – హైదరాబాద్ (02576) ఆగస్టు 6 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఆయా రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.