Ashes 2023 | యాషెస్ సిరీస్‌లో ఊహించ‌ని ఘ‌ట‌న‌.. కాస్త అయితే కొట్టే వాడేమో..!

Ashes 2023 | ప్ర‌స్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మ‌ధ్య యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ న‌డుస్తుంది. రెండు జ‌ట్లు పోటాపోటీగా ఆడుతున్నా కూడా అదృష్టం ఆసీస్ వైపే ఉంది. రెండు టెస్ట్‌ల‌లోను ఇంగ్లండ్ గెలుపు వ‌రకు వ‌చ్చి ప‌రాజ‌యం పాలైంది. మ‌రోవైపు లార్డ్స్ టెస్ట్‌లో బెయిర్ స్టో స్టంపౌట్‌పై వివాదం పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగ‌గా, ఆసీస్ అడ్డదారిలో విజయం సాధించిందని ఇంగ్లండ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో రెండు జ‌ట్ల మ‌ధ్య ఉద్రిక్త […]

  • By: sn    latest    Jul 08, 2023 4:09 AM IST
Ashes 2023 | యాషెస్ సిరీస్‌లో ఊహించ‌ని ఘ‌ట‌న‌.. కాస్త అయితే కొట్టే వాడేమో..!

Ashes 2023 |

ప్ర‌స్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మ‌ధ్య యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ న‌డుస్తుంది. రెండు జ‌ట్లు పోటాపోటీగా ఆడుతున్నా కూడా అదృష్టం ఆసీస్ వైపే ఉంది. రెండు టెస్ట్‌ల‌లోను ఇంగ్లండ్ గెలుపు వ‌రకు వ‌చ్చి ప‌రాజ‌యం పాలైంది.

మ‌రోవైపు లార్డ్స్ టెస్ట్‌లో బెయిర్ స్టో స్టంపౌట్‌పై వివాదం పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగ‌గా, ఆసీస్ అడ్డదారిలో విజయం సాధించిందని ఇంగ్లండ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో రెండు జ‌ట్ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి.మూడో టెస్ట్‌లో త‌ప్ప‌క గెల‌వాల‌ని ఇంగ్లండ్ జ‌ట్టు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ద‌క్కించుకోవాల‌ని ఆసీస్ భావిస్తుంది.

అయితే మూడో టెస్టు రసవత్తరంగా సాగుతుండ‌గా, మ్యాచ్‌పై పట్టు కోసం ఇరు జట్లు హోరా హోరీగా పోటి ప‌డుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కి 26 పరుగుల స్వల్ప ఆధిక్యం రాగా, రెండో ఇన్నింగ్స్‌లో స‌త్తా చూపించ‌లేక‌పోతుంది. ఈ క్ర‌మంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో మధ్య చిన్నపాటి మాటల యుద్దం న‌డిచింది.

ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ్యాట‌ర్‌లోకి వెళితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌‌లో మొయిన్ అలీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా స్మిత్ వెనుదిరిగాడు. మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నంగా చేయగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బెన్ డకెట్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ని సునాయాసంగా అందుకున్నాడు.

త‌క్కువ ఎత్తులో వ‌చ్చిన కూడా ఎలాంటి త‌ప్పిదం చేయ‌కుండా క్యాచ్ అందుకోవ‌డంతో స్మిత్ వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. అయితే స్మిత్ అవుట్ కాగానే బెయిర్ స్టో.. పో.. మ‌ళ్లీ క‌లుద్దాం లే అనేలా కామెంట్ చేశాడు. అప్ప‌టికే ఔట‌య్యాన‌నే కోపంలో ఉన్న స్మిత్.. స‌ఏం ఏమో అంటున్నావ్?’అని గట్టిగా అరిచాడు. దానికి స్పందించిన‌ బెయిర్ స్టో.. ‘నేను ఏమన్నా.. ఔటైనందుకు ఛీర్స్ చెబుతూ మళ్లీ కలుద్దామంటున్నా అని అన్నానని బ‌దులిచ్చాడు.

ఈ సంఘ‌ట‌న కాస్త ఉద్రిక్త‌త చోట‌య్యేలా చేసింది.లార్డ్స్ టెస్ట్ త‌ర్వాత ప్ర‌తీ చిన్న విష‌యం కూడా వివాదం అవుతుంది. ఇక ఆసీస్ ఇన్నింగ్ విష‌యానికి వ‌స్తే.. ఆట ముగిసే సమయానికి 116/4తో నిలిచింది ఆసీస్.. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.ప్ర‌స్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్‌ (18 బ్యాటింగ్‌), మిచెల్‌ మార్ష్‌ (17 బ్యాటింగ్‌) ఉన్నారు. వీరు ఇంగ్లండ్ ముందు ఎంత టార్గెట్ నిర్ధేశిస్తారో చూడాలి.