Stock markets | మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ స్టాక్ మార్కెట్లకు సెలవు

Stock markets: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ (శుక్రవారం) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ () సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ () నిఫ్టీలో ఇవాళ ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నేడు స్టాక్‌మార్కెట్లకు సెలవు కారణంగా.. ఉదయం సెషన్లలో కమోడిటీ మార్కెట్ మూతపడి ఉంటుంది. కానీ సాయంత్రం 5:00 గంటలకు ట్రేడింగ్ కార్యకలాపాలు కొంతసేపు జరుగుతాయి.
అదే సమయంలో ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో శుక్రవారం ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోనుంది. కానీ పైన చెప్పినట్లుగా కమోడిటీ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక మూడు రోజుల లాంగ్వీకెండ్సెలవుల అనంతరం దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం తిరిగి తెరచుకోనున్నాయి.
స్టాక్ మార్కెట్ సెలవులు
2024 మార్చిలో వచ్చే మూడు స్టాక్ మార్కెట్ సెలవుల్లో మహా శివరాత్రి సెలవు ఒకటి. అదేవిధంగా హోలీ, గుడ్ ఫ్రైడేల సందర్భంగా వరుసగా మార్చి 25, మార్చి 29న కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు మూతపడి ఉంటాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న స్టా్‌క్ మార్కెట్‌లకు తొలి సెలవు వచ్చింది. అంతకుముందు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా మహారాష్ట్ర సర్కారు జనవరి 22న స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించింది. ఫిబ్రవరిలో సెలవులు లేవు. ఏప్రిల్ నెలలో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్), శ్రీరామనవమి పండుగల సందర్భంగా 11, 17 తేదీల్లో కూడా సెలవులు ఇవ్వనున్నారు.