NEET | నీట్‌లో ఫెయిలై విద్యార్థి ఆత్మహత్య.. 24 గంటల్లోనే తండ్రి కూడా..
NEET | నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఫెయిలవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకోగా.. ఆ బాధతో కుమిలిపోయిన అతడి తండ్రి కూడా ప్రాణాలు తీసుకున్నారు. తమిళనాడులోని చెన్నై (Chennai) లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జగదీశ్వరన్ అనే బాధిత విద్యార్థి 2022లో 427 మార్కులతో ఇంటర్ పాసయ్యాడు. డాక్టర్ చదవాలన్న ఆశయంతో నీట్ పరీక్ష రెండు సార్లు రాసినప్పటికీ.. రెండు సార్లూ మెరుగైన ర్యాంకు సాధించలేకపోయాడు. దీంతో కుంగిపోయిన జగదీశ్వరన్ శనివారం […]

NEET |
నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఫెయిలవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకోగా.. ఆ బాధతో కుమిలిపోయిన అతడి తండ్రి కూడా ప్రాణాలు తీసుకున్నారు. తమిళనాడులోని చెన్నై (Chennai) లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జగదీశ్వరన్ అనే బాధిత విద్యార్థి 2022లో 427 మార్కులతో ఇంటర్ పాసయ్యాడు.
డాక్టర్ చదవాలన్న ఆశయంతో నీట్ పరీక్ష రెండు సార్లు రాసినప్పటికీ.. రెండు సార్లూ మెరుగైన ర్యాంకు సాధించలేకపోయాడు. దీంతో కుంగిపోయిన జగదీశ్వరన్ శనివారం చెన్నైలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక సతమతమైన అతడి తండ్రి సెల్వసేకర్.. అదే ఇంట్లో ఉరేసుకుని మరణించారు.
ఆదివారం ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మరణాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరీక్షలు పోతే డీలా పడొద్దని.. ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.
నీట్ వల్ల పేద విద్యార్థులకు సీట్లు రావడం లేదని విమర్శిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2021లోనే నీట్‌ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని డిమాండ్ చేసింది. దీంతో తాజాగా మరోసారి నీట్ పరీక్షపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు.