నిద్రలో పీడకలలు.. భయంతో విద్యార్థి ఆత్మహత్య
Himachal Pradesh | నిద్రలో పీడకలలు వస్తున్నాయని, నిద్ర సరిగా పట్టడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కులూ జిల్లాలోని బంజారా ఏరియాలో నివాసముంటున్న ఓ 17 ఏండ్ల బాలుడు 11వ తరగతి చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటున్న అతడికి రాత్రి సమయాల్లో పీడకలలు వచ్చేవి. దీంతో […]

Himachal Pradesh | నిద్రలో పీడకలలు వస్తున్నాయని, నిద్ర సరిగా పట్టడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కులూ జిల్లాలోని బంజారా ఏరియాలో నివాసముంటున్న ఓ 17 ఏండ్ల బాలుడు 11వ తరగతి చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటున్న అతడికి రాత్రి సమయాల్లో పీడకలలు వచ్చేవి. దీంతో భయపడి లేచేవాడు. నిద్ర సరిగా పట్టేది కాదు. గత ఏడు రోజుల నుంచి ప్రతి రాత్రి ఇదే పరిస్థితి. మంగళవారం అర్ధరాత్రి కూడా పీడకలలు వచ్చాయి. తీవ్ర ఆందోళనకు గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం, అతని గదిలో సూసైడ్ నోట్ లభించింది. నిద్ర లేకపోవడం, పీడ కలలు పడటంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. యువకుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.